ప్రస్తుతం కరోనా సంక్షోభం కారణంగా చాలా మంది రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి సహజ వనరులపై దృష్టి పెట్టారు. పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడానికి ప్రాధాన్యత చూపిస్తున్నారు. అయితే సలాడ్ లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. సలాడ్.. పచ్చి కూరగాయలు.. ఆకు కూరలు కలిపి తీసుకుంటారు. సలాడ్ రోజు తీసుకోవడం వలన అనారోగ్యాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
సలాడ్ అంటే కేవలం శాఖాహరం మాత్రమే కాదు… అందులో గుడ్లు, మాంసం కూడా కలుపుకోవచ్చు. సలాడ్ లో ఉల్లిపాయలు, టమోటాలు, బ్రోకలీ వంటి పచ్చి కూరగాయలతో రెడీ చేసుకోవచ్చు. అలాగే ఎండిన పండ్లు, కూరగాయలు, ముడి కాయలు, విత్తనాలు, పులియబెట్టిన వంటకాలను కూడా తీసుకోవచ్చు. సీవీడ్స్, ముడి గుడ్లు, ఎండిన మాంసంతో కూడా తీసుకోవచ్చు. అయితే సలాడ్ నిత్యం తీసుకోవాలని భావించేవారు.. జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్.. కాఫీ తీసుకోవడం తగ్గించాలి.
ఆరోగ్య ప్రయోజనాలు..
సలాడ్ కోసం ఉపయోగించే పచ్చి కూరగాయలలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. షుగర్, బీపీ వంటి సమస్యలను నియంత్రిస్తాయి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, కొవ్వులు, ప్రోటిన్స్ పుష్కలంగా ఉంటాయి. పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లు అధికంగా ఉండడం వలన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అంతేకాదు.. సలాడ్ రోజూ తీసుకునేవారు క్రమంగా బరువు తగ్గుతారు. చెడు కొలెస్ట్రాల్ తగ్గించడమే కాదు… బరువు తగ్గడానికి సహాయపడుతుంది. సలాడ్స్ లో కేలరీలు తక్కువగా ఉంటాయి. అందువలన, వెయిట్ ను తగ్గడానికి డైటీషియన్స్ వీటిని రికమెండ్ చేస్తారు. హై కేలరీ స్నాక్ పై ఆధారపడే కంటే సలాడ్ పై ఆధారపడటం ఎంతో మంచిది.