జీలకర్ర నీళ్లలో బెల్లం ముక్క కలిపితే మహా అద్భుతం.. బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు

|

Jun 07, 2024 | 10:55 AM

జీలకర్ర నీళ్లలో బెల్లం ముక్క కలిపి తాగితే అది దివ్యౌషధంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది అనేక వ్యాధుల నుండి శాశ్వతమైన ఉపశమనం కలిగిస్తుంది. ఇందుకోసం ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా జీలకర్ర వేసి మరిగించి అందులో బెల్లం ముక్క కలపండి. ఇది మన శరీరానికి అమృతంలా పనిచేస్తుంది.

జీలకర్ర నీళ్లలో బెల్లం ముక్క కలిపితే మహా అద్భుతం.. బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు
Cumin And Jaggery Water
Follow us on

బెల్లం, జీలకర్ర నీరు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. బెల్లం, జీలకర్ర నీటిని తాగడం ద్వారా రక్తహీనత నయం అవుతుందని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. బెల్లం, జీలకర్ర నీళ్లు తాగితే అనేక వ్యాధుల నుంచి శాశ్వత ఉపశమనం పొందవచ్చు.
ఇందులో ఆరోగ్యానికి అవసరమైన ఐరన్, విటమిన్లు, క్యాల్షియం, ఫైబర్ మొదలైనవి ఉంటాయి. బెల్లం, జీలకర్ర నీటిని తాగడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

జీలకర్ర నీళ్లలో బెల్లం ముక్క కలిపి తాగితే అది దివ్యౌషధంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది అనేక వ్యాధుల నుండి శాశ్వతమైన ఉపశమనం కలిగిస్తుంది. ఇందుకోసం ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా జీలకర్ర వేసి మరిగించి అందులో బెల్లం ముక్క కలపండి. ఇది మన శరీరానికి అమృతంలా పనిచేస్తుంది. జీలకర్ర బెల్లం నీటిలో ఐరన్, కాల్షియం, డైటరీ ఫైబర్, విటమిన్లు సహా అనేక పోషకాలు ఉన్నాయి. జీలకర్ర బెల్లం నీరు త్రాగడం వల్ల తుంటి, వెన్నునొప్పి నుండి శాశ్వత ఉపశమనం లభిస్తుంది.ఇది నేచురల్ బ్లడ్ ప్యూరిఫైయర్‌గా పనిచేస్తుంది. ఇది రక్తంలోని మలినాలను తొలగిస్తుంది. కడుపు సమస్యలతో బాధపడేవారు జీలకర్ర బెల్లం నీరు త్రాగాలి. ఇది జీర్ణ సమస్యలు, మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.

నడుము నొప్పి ఉన్నవారు బెల్లం, జీలకర్ర కలిపి తీసుకోవాలి. బెల్లం, జీలకర్ర నీటిలో అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి వెన్నునొప్పి వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి. బెల్లం, జీలకర్ర కలిపి తాగితే రక్తహీనత నయమవుతుంది. ఎందుకంటే బెల్లం, జీలకర్ర నీటిలో ఐరన్‌ కావాల్సింతగా లభిస్తుంది. ఇది రక్త లోపాన్ని భర్తీ చేస్తుంది. దీనితో పాటు, రక్తంలో ఉన్న మలినాలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

సాధారణంగా ఆడపిల్లలు పీరియడ్స్ సమయంలో విపరీతమైన నొప్పులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీకు పీరియడ్స్ సమయంలో నొప్పి ఉండకూడదనుకుంటే, రోజూ కనీసం ఒక గ్లాసు బెల్లం నీటిలో టీ స్పూన్‌ జీలకర్ర పొడిని కలిపి తాగండి. ఇందులో ఉండే పోషకాలు పీరియడ్స్‌లో వచ్చే నొప్పి, ఇతర సమస్యలను దూరం చేస్తుంది. అంతేకాదు.. తలనొప్పికి కూడా చక్కటి పరిష్కారంగా పనిచేస్తుంది. తలనొప్పితో బాధపడేవారు రోజూ ఒక గ్లాసు బెల్లం, జీలకర్ర కలిపి తాగాలి. ఇందులో ఉండే పోషకాలు తలనొప్పి నుండి ఉపశమనం కలిగించడమే కాకుండా ఇతర వ్యాధుల నుండి కూడా రక్షిస్తాయి.

బెల్లం, జీలకర్ర నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే సహజ గుణాలు శరీరాన్ని లోపలి నుండి శుభ్రపరచి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతాయి. జీర్ణశక్తి బలహీనంగా ఉన్నవారు తప్పనిసరిగా బెల్లం, జీలకర్ర కలిపిన నీటిని తాగాలి. బెల్లం, జీలకర్ర నీటిలో ఫైబర్ ఉన్నందున, ఇది మలబద్ధకం, గ్యాస్ మొదలైన కడుపు సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..