Covid Care: కరోనా రోగులు ఈ ఆహార పదార్థాలను అస్సలు తినకూడదట.. అవెంటో తెలుసా..

|

May 07, 2021 | 5:46 PM

కరోనా సెకండ్ వేవ్ దేశంలో మరణ మృదంగం మోగిస్తోంది. వయసుతో సంబంధం లేకుండా ఈ వైరస్ ప్రతి ఒక్కరికి సోకుతుంది. దీంతో దేశంలో

Covid Care: కరోనా రోగులు ఈ ఆహార పదార్థాలను అస్సలు తినకూడదట.. అవెంటో తెలుసా..
Corona Patient Food
Follow us on

కరోనా సెకండ్ వేవ్ దేశంలో మరణ మృదంగం మోగిస్తోంది. వయసుతో సంబంధం లేకుండా ఈ వైరస్ ప్రతి ఒక్కరికి సోకుతుంది. దీంతో దేశంలో రోజుకీ నాలుగు లక్షల వరకు కేసులు నమోదవుతుండగా.. వేలాది సంఖ్యలో ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ఇదిలా ఉంటే.. కరోనా వచ్చి.. స్వల్ప లక్షణాలు ఉన్నవారు ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు. అయితే కరోనా వచ్చిన వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే సందేహాలు మాత్రం చాలా మందిలో ఉన్నాయి. అయితే కోవిడ్ బారిన పడినప్పుడు బలవర్థకమైన ఆహారం తీసుకోవాలి. ఇక కొన్ని హానికరమైన ఆహారాలను కూడా దూరం పెట్టాలి. కరోనా రోగులు ఎలాంటి ఆహారం తీసుకోకుడదో తెలుసుకుందామా..

కరోనా బారిన పడిన వ్యక్తులు.. శీతల పానీయాలను అసలు తీసుకోకుడదు. తీపిగా ఉండే డ్రింక్స్ కూడా తాగకూడదు. ఇవి శరీరంలోని ఇన్‏ఫ్లమేషన్ ను పెంచి, కోలుకునే వేగాన్ని తగ్గిస్తాయి. వీటికి బదులుగా మజ్జిగ, సోడా కలిపిన నిమ్మరసం లాంటి పానీయాలు తీసుకోవడం ఉత్తమం. అలాగే వేపుళ్ళను తగ్గించాలి. ఇందులో కొవ్వు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రతి సారి తినాలనే కోరిక కలుగుతుంటుంది. అయితే ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకోవడమే కాకుండా.. జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెంచుతాయి. పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా మీద కొవ్వులు చెడు ప్రభావం చూపిస్తాయి. ఫలితంగా వ్యాధినిరోధకశక్తి తగ్గుతుంది. అంతే కాకుండా వేయించిన పదార్థాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. కాబట్టి కొవిడ్‌ నుంచి కోలుకునే సమయంలో వేపుళ్లకు దూరంగా ఉండాలి. ఇక ఘాటుగా ఉండే మసాలాలు, కారాల వంటలు కూడా తీసుకోకుడదు. ఇవి గొంతులో మంటను కలిగించడమే కాకుండా.. దగ్గును పెంచుతాయి. కాబట్టి వంటల్లో కారానికి బదులుగా మరియాల పొడిని వాడుకోవాలి. మిరియాలకు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. కాబట్టి వ్యాధి నుంచి కోలుకోవడానికి ఇవి సహయపడతాయి. అలాగే ప్యాకేజ్ చేసిన ఫుడ్ అసలు తీనకూడదు. ఇందులో సోడియంతో పాటు నిల్వ కోసం ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచే ఈ పదార్థాలు కలిసిన ఆహారం తింటే, కొవిడ్‌ నుంచి కోలుకునే వేగం కుంటుపడుతుంది. అలాగే రోగనిరోధకశక్తి కూడా సన్నగిల్లుతుంది.

Also Read: సినీ పరిశ్రమలో కరోనా కల్లోలం.. హీరో కృష్ణ సన్నిహితులతో సహ ఒక్కరోజే నలుగురు మృతి..