
వ్యాగన్ వైట్ క్రిస్మస్ స్లైస్ (Vegan White Christmas Slice) ఇది పూర్తి శాకాహార వంటకం. పంచదారకు బదులుగా మేపుల్ సిరప్ వాడటం వల్ల ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. ఈ డెజర్ట్‌లను ముందు రోజే తయారు చేసి ఫ్రిజ్‌లో భద్రపరుచుకోవచ్చు. దీనివల్ల పండుగ రోజున వంట గదిలో ఎక్కువ సమయం గడపాల్సిన అవసరం ఉండదు. 2025 క్రిస్మస్ టేబుల్ పై ప్రత్యేకంగా నిలిచే రెండు అద్భుతమైన రెసిపీలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి.
కోకో బటర్ (65 గ్రా),
మెకాడమియా నట్స్ (ముప్పావు కప్పు),
తురిమిన కొబ్బరి (ముప్పావు కప్పు),
ఉప్పు (చిటికెడు),
మేపుల్ సిరప్ (3 స్పూన్లు),
వెనిల్లా ఎసెన్స్ (2 స్పూన్లు)
ఎండు క్రాన్‌బెర్రీస్ (అర కప్పు)
పిస్తాపప్పు (అర కప్పు)
కిస్‌మిస్‌లు (పావు కప్పు).
ముందుగా కోకో బటర్‌ను కరిగించి పక్కన పెట్టుకోవాలి. బ్లెండర్‌లో మెకాడమియా నట్స్, కొబ్బరి వేసి మెత్తగా చేసి, కరిగించిన కోకో బటర్‌లో కలపాలి. అందులో ఉప్పు, మేపుల్ సిరప్, వెనిల్లా వేసి ఉండలు లేకుండా కలపాలి. చివరగా క్రాన్‌బెర్రీస్, పిస్తా, కిస్‌మిస్‌లు వేసి బాగా కలిపి ఒక ట్రేలో సర్దాలి. దీనిపై అదనంగా కొన్ని పిస్తాపప్పులు చల్లి, గంట పాటు ఫ్రిజ్‌లో పెట్టి తీస్తే రుచికరమైన స్లైసెస్ సిద్ధం.
హాజెల్‌నట్ ట్రఫుల్స్ (Hazelnut Truffles) చాక్లెట్ ప్రియుల కోసం ప్రత్యేకమైన వంటకం. హాజెల్‌నట్స్ ఇచ్చే క్రంచీ రుచి దీనికి ప్రత్యేకం.
డార్క్ చాక్లెట్ (500 గ్రా)
డైరీ క్రీమ్ (250 గ్రా)
వెన్న (40 గ్రా)
వేయించి పొడి చేసిన హాజెల్‌నట్స్ (200 గ్రా).
క్రీమ్‌ను వేడి చేసి, ముక్కలుగా చేసిన చాక్లెట్‌పై పోయాలి. చాక్లెట్ పూర్తిగా కరిగే వరకు నెమ్మదిగా కలపాలి. తర్వాత అందులో వెన్న వేసి బాగా కలిపి, సుమారు 4-5 గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. మిశ్రమం గట్టిపడిన తర్వాత చిన్న చిన్న బాల్స్‌లా చుట్టి, హాజెల్‌నట్ పొడిలో దొర్లించాలి. వీటిని పేపర్ కప్పుల్లో పెట్టి సర్వ్ చేస్తే ఎంతో రిచ్‌గా ఉంటాయి.