Chinta Chiguru Podi: కరోనా ను ఎదుర్కోవడానికి ప్రస్తుతం రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలని ప్రతి ఒక్కరూ సూచిస్తున్నారు. అయితే సి విటమిన్ టాబ్లెట్స్ వేసుకునే కంటే.. సి విటమిన్ ఉన్న ఆహార పదార్ధాలను పండ్లను తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఇక ఈ కాలంలో విరివిగా దొరికే చింతచిగురులో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది.. దీంతో ఈ కాలంలో చింతచిగురుని కురలుగా చేసుకుని తింటారు.. అయితే చింత చిగురుతో పొడి చేసి.. నిల్వ ఉంచుకోవచ్చు.. ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యితో కలిపి తినొచ్చు.. ఈరోజు టేస్టీ టేస్టీ చింతచిగురు పొడి తయారీ ఎలాగో తెలుసుకుందాం..
చింత చిగురు పొడి తయారీకి కావాల్సిన పదార్ధాలు :
చింతచిగురు – 200 గ్రాములు
ఎండుమిరపకాయలు – 15
ధనియాలు – అరకప్పు
మినపప్పు – నాలుగు స్పూన్లు
ఉప్పు – రుచికి తగినంత
నూనె – అయిదు స్పూన్లు
ఆవాలు
జీలకర్ర
వెల్లుల్లి
ముందుగా చింతచిగురుని శుభ్రం చేసుకుని చెత్తో బాగా నలిపి చిన్న పుల్లలు ఈనెలు తీసి వేయాలి . తర్వాత ఒక అరగంట సేపు నీడన ఆరనివ్వాలి. తర్వాత స్టౌ మీద బాండీ పెట్టి నూనె వేసి నూనె వేడి ఎక్కిన తర్వాత ఎండుమిరపకాయలు , ధనియాలు , చాయ మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి . తర్వాత నలిపి ఉంచిన చింత చిగురు కూడా వేసి వేయించుకోవాలి . చల్లారగానే ఈ మిశ్రమాన్ని మిక్సీ లో వేసి తగినంత ఉప్పు వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి. కారప్పొడి కనుక ఇష్టమైనవారు పొట్టు తీయని కొన్ని వెల్లుల్లి రేకలు వేసి మిక్సీ వేసుకోవాలి.
ఈ చింత చిగురు పొడి ఇడ్లీ , దోశె మరియు అన్నం లోకి బాగుంటుంది .
Also Read: ఇక్కడ స్వామివారికి పానకం నైవేద్యం.. ఒక్క చీమ కూడా కనిపించని క్షేత్రం..