మామూలుగా మనం బయట నుంచి చికెన్ పట్టుకొచ్చినప్పుడు దాన్ని గిన్నెలోకి వేసుకుని శుభ్రంగా కడుక్కోని కావాల్సిన మసాలాలను దట్టించి హ్యాపీగా కూర వండుకుని తినేస్తాం. ఈ ప్రాసెస్ చికెన్ తెచ్చిన ప్రతిసారి చేస్తూనే ఉంటాం. అయితే ప్రపంచ ఆహార భద్రతా నిపుణులు మాత్రం చికెన్ తీసుకురాగానే కడగకుండా డైరెక్ట్ గా వండేసుకోడమే బెటర్ అని సూచిస్తున్నారు. ఎందుకంటే చికెన్ కడిగితే వంటగది చుట్టూ ప్రమాదకరమైన బ్యాక్టిరియా పెరగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి చికెన్ కడుగకుండా వండేసుకోడమే మంచిది అని అంటున్నారు. అయితే వండే సమయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. సరైన ఉష్టోగ్రతలో చికెన్ వండకపోతేనే ఇబ్బంది ఎదురవుతుంది తప్ప కడగకపోడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యానికి క్యాంపిలోబాక్టర్, సాల్మోనెల్లా అనే బ్యాక్టిరియాలు కారణమవుతాయి. ఇవి ముఖ్యంగా క్రాస్ కాలుష్యం వల్ల సంభవిస్తుంది. చికెన్ వల్ల వచ్చే సమస్యకు కేవలం క్యాంపిలోబాక్టర్ మాత్రమే ప్రధాన కారణంగా నిలుస్తుంది.
మనం ఎంత తప్పని చెప్పినా ఇంట్లో వారు మాత్రం చికెన్ ను కడగకుండా వండటానికి ఇష్టపడరు. కాబట్టి డైరెక్ట్ గా సింక్ వద్ద కాకుండా నీటిని ఓ పాత్రలోకి పట్టి అందులో చికెన్ ను వేసి నీరు చిందకుండా ఓ సారి లైట్ గా శుభ్రపరిస్తే మంచిది. ఇలా చేయడం వల్ల క్రాస్-కాలుష్యం వల్ల కలిగే ఇబ్బందులను కొంచెమైనా నివారించవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..