AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Carrot: క్యారెట్ వీరికి విషంతో సమానం.. తినేముందు ఈ విషయాలు పక్కా తెలుసుకోండి..

సూపర్ ఫుడ్స్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే వాటిలో క్యారెట్ ఒకటి. సాంబార్, ఫ్రైస్, సూప్‌లు లేదా జ్యూస్ వంటి వివిధ రూపాల్లో మనం క్యారెట్లను మన రోజువారీ ఆహారంలో తీసుకుంటాము. కానీ క్యారెట్లు అందరికీ ఒకేలా ప్రయోజనకరంగా ఉండవు. కొన్ని సమస్యలు ఉన్నవారు వీటికి దూరంగా ఉండడమే చాలా మంచిది.

Carrot: క్యారెట్ వీరికి విషంతో సమానం.. తినేముందు ఈ విషయాలు పక్కా తెలుసుకోండి..
Who Should Not Eat Carrots
Krishna S
|

Updated on: Jun 17, 2026 | 6:50 AM

Share

కంటి చూపును మెరుగుపరచడంలో, చర్మాన్ని మెరిపించడంలో క్యారెట్లకు సాటి వచ్చే కూరగాయ మరొకటి లేదు. విటమిన్లు, మినరల్స్, ముఖ్యంగా విటమిన్ ఎ, బీటా-కెరోటిన్, యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉండే క్యారెట్లను మనం సాంబార్, ఫ్రైస్, సూప్‌లు లేదా జ్యూస్ రూపంలో నిత్యం తీసుకుంటాము. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడం, బరువు తగ్గాలనుకునే వారికి ఫైబర్ అందించి ఆకలిని నియంత్రించడంలో క్యారెట్ ఒక సూపర్ ఫుడ్. గర్భిణీ స్త్రీలకు కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. అయితే అమృతం లాంటి ఈ క్యారెట్లు అందరికీ ఒకేలా ప్రయోజనకరంగా ఉండవు. వైద్యుల అభిప్రాయం ప్రకారం.. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు క్యారెట్లను ఎక్కువగా తింటే, అవి శరీరంలో రివర్స్ యాక్షన్ మొదలుపెట్టి ప్రాణాల మీదకు తెచ్చే ప్రమాదం ఉంది. మరి ఏయే వ్యాధులు ఉన్నవారు క్యారెట్లకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం…

ఈ  ఆరోగ్య సమస్యలు ఉన్నవారు క్యారెట్లను మితంగానే తినాలి:

కిడ్నీలో రాళ్లు ఉన్నవారు

మూత్రపిండాల్లో రాళ్లు, ముఖ్యంగా కాల్షియం ఆక్సలేట్ రాళ్లతో బాధపడేవారు క్యారెట్లను తినేటప్పుడు తీవ్ర జాగ్రత్తలు వహించాలి. క్యారెట్లలో సహజంగానే ఆక్సలేట్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కిడ్నీలో రాళ్లు మరింత వేగంగా పెరిగే లేదా కొత్త రాళ్లు ఏర్పడే ముప్పు పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి రోగులు క్యారెట్లను చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవాలి.

డయాబెటిస్

డయాబెటిక్ రోగులు పచ్చి క్యారెట్లను ముక్కలుగా మితంగా తింటే పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ క్యారెట్లను జ్యూస్ రూపంలో తాగడం లేదా ఎక్కువగా తీసుకోవడం అస్సలు మంచిది కాదు. క్యారెట్లలో సహజ చక్కెరలు ఉంటాయి. వీటిని జ్యూస్ చేసినప్పుడు ఫైబర్ తగ్గిపోయి, గ్లైసీమిక్ ఇండెక్స్ పెరిగి.. రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా షూట్ అప్ అవుతాయి.

గ్యాస్, ఉబ్బరం – కడుపు సమస్యలు

గ్యాస్, అసిడిటీ, బరువు పెరగడం లేదా కడుపు ఉబ్బరం వంటి జీర్ణక్రియ సమస్యలతో సతమతమయ్యే వారు క్యారెట్లను జాగ్రత్తగా తినాలి. క్యారెట్లలో ఫైబర్ అత్యధికంగా ఉంటుంది. సాధారణంగా ఫైబర్ మంచిదే అయినప్పటికీ, జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నప్పుడు దీన్ని ఎక్కువగా తీసుకుంటే అజీర్ణం మరియు కడుపులో తీవ్ర అసౌకర్యం పెరుగుతుంది.

లివర్ బలహీనత – కామెర్లు

బలహీనమైన కాలేయంలేదా కామెర్ల బారిన పడిన వారు క్యారెట్లను చాలా పరిమితంగానే తీసుకోవాలి. క్యారెట్లను అవసరానికి మించి ఎక్కువగా తింటే.. వాటిలోని బీటా కెరోటిన్ కాలేయం సరిగ్గా ప్రాసెస్ చేయలేదు. దీనివల్ల ఆ కెరోటిన్ శరీరంలో పేరుకుపోయి, చర్మం కొద్దిగా పసుపు రంగులోకి మారే ప్రమాదం ఉంది. దీనిని వైద్య పరిభాషలో కరోటెనిమియా అంటారు.

అలర్జీ సమస్యలు ఉన్నవారు

కొందరికి కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల ఫుడ్ అలర్జీలు వస్తుంటాయి. క్యారెట్లు తిన్న తర్వాత శరీరంలో దురద, వాపు, గొంతులో గీరినట్లు అనిపించడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే.. మీకు క్యారెట్ అలర్జీ ఉన్నట్లు అర్థం. అలాంటప్పుడు వెంటనే వాటిని తినడం మానేసి డాక్టర్‌ను సంప్రదించాలి.

క్యారెట్ జ్యూస్‌తో కలిగే 3 అద్భుత ప్రయోజనాలు..

నియమాలకు అనుగుణంగా మితంగా తీసుకుంటే క్యారెట్ రసం శరీరానికి ఒక సంజీవనిలా పనిచేస్తుంది.

మెరిసే చర్మం: క్యారెట్ రసంలో ఉండే విటమిన్ ఎ, యాంటీఆక్సిడెంట్లు చర్మంపై ముడతలను తగ్గించి, మొటిమలను కంట్రోల్ చేస్తాయి.

కంటి చూపు మెరుగు: వయసు పెరగడం వల్ల వచ్చే కంటి చూపు సమస్యలను నివారించి, దృష్టిని బలపరచడంలో క్యారెట్ జ్యూస్ నంబర్ 1 గా పనిచేస్తుంది.

రోగనిరోధక శక్తి: తరచూ ఇన్‌ఫెక్షన్ల బారిన పడేవారికి క్యారెట్ రసం అద్భుతమైన ఎంపిక. ఇది ఇమ్యూనిటీని పెంచి రోగాలతో పోరాడే శక్తిని ఇస్తుంది.

(గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఏదైనా ఆహారాన్ని మీ రోజువారీ డైట్‌లో చేర్చుకునే ముందు ముఖ్యంగా మీకు డయాబెటిస్, కిడ్నీ సమస్యలు లేదా ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు వైద్యుడిని లేదా సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్‌ను సంప్రదించి సలహా తీసుకోగలరు.)

Follow Us
‘భారత్‌ను చూసి నేర్చుకోండి’ ఫెడ్ వడ్డీ రేట్ల పై ట్రంప్ ఆగ్రహం
‘భారత్‌ను చూసి నేర్చుకోండి’ ఫెడ్ వడ్డీ రేట్ల పై ట్రంప్ ఆగ్రహం
కోట్లు పోసి ఇంటిని కొన్న హీరోయిన్.. కట్ చేస్తే తొమ్మిది రోజుల్లోన
కోట్లు పోసి ఇంటిని కొన్న హీరోయిన్.. కట్ చేస్తే తొమ్మిది రోజుల్లోన
ఇండియా-ఏ ఖాతాలో అరుదైన రికార్డు
ఇండియా-ఏ ఖాతాలో అరుదైన రికార్డు
వంటగదిలో రాత్రి పూట ఈ శబ్దాలు ఏంటా అని చూడగా.. బాబోయ్..
వంటగదిలో రాత్రి పూట ఈ శబ్దాలు ఏంటా అని చూడగా.. బాబోయ్..
డీజే సౌండ్‌కు వణికిపోయిన భారీ పాత్రలు.. నెట్టింట వీడియో హల్‌చల్
డీజే సౌండ్‌కు వణికిపోయిన భారీ పాత్రలు.. నెట్టింట వీడియో హల్‌చల్
జంతువును మింగి పత్తి చేనులో తిష్టవేసిన భారీ కొండచిలువ..
జంతువును మింగి పత్తి చేనులో తిష్టవేసిన భారీ కొండచిలువ..
నేను పెద్ద స్టార్ అనే భావం ఆయనలో ఏమాత్రం ఉండదు..
నేను పెద్ద స్టార్ అనే భావం ఆయనలో ఏమాత్రం ఉండదు..
ముఖం మెరిసిపోవాలంటే మజ్జిగతో ఇలా చేయండి.. ఖరీదైన క్రీములు వొద్దు!
ముఖం మెరిసిపోవాలంటే మజ్జిగతో ఇలా చేయండి.. ఖరీదైన క్రీములు వొద్దు!
పొరపాటున కూడా రోడ్డు మీద ఈ వస్తువులు కనపడితే అస్సలు దాటకండి.. 
పొరపాటున కూడా రోడ్డు మీద ఈ వస్తువులు కనపడితే అస్సలు దాటకండి.. 
తన పిల్లలను కాకి చేత పెంచించే కోయిల.. ప్రకృతిలో ఇదో వింత వ్యూహం!
తన పిల్లలను కాకి చేత పెంచించే కోయిల.. ప్రకృతిలో ఇదో వింత వ్యూహం!