Summer Food: సమ్మర్ లో గుడ్లు, చికెన్ తినొచ్చా? లేదా?.. అయితే వీడియోను కచ్చితంగా చూడాల్సిందే

|

Mar 04, 2024 | 7:29 PM

వేసవిలోశరీర సమతుల్యత ఉండాలంటే శరీరాన్ని చల్లబరిచే అందించే ఆహారాలకు మనం తరచుగా తీసుకోవాలి. ఇవి కండరాల బలాన్ని పెంపొందించడంలో సహాయపడటం, పెరుగుదలకు కారణమవుతుంది. కాబట్టి ప్రోటీన్ శరీరానికి అవసరం. అయితే, గుడ్లు, చికెన్, చేపలు వంటి సమ్మర్ లో తీసుకోకపోవడం చాలా బెటర్ అని, ఇవన్నీ మరింత వేడిని పుట్టిస్తాయని చాలామంది వాదన.

Summer Food: సమ్మర్ లో గుడ్లు, చికెన్ తినొచ్చా? లేదా?.. అయితే వీడియోను కచ్చితంగా చూడాల్సిందే
Eating Food
Follow us on

వేసవిలోశరీర సమతుల్యత ఉండాలంటే శరీరాన్ని చల్లబరిచే అందించే ఆహారాలకు మనం తరచుగా తీసుకోవాలి. ఇవి కండరాల బలాన్ని పెంపొందించడంలో సహాయపడటం, పెరుగుదలకు కారణమవుతుంది. కాబట్టి ప్రోటీన్ శరీరానికి అవసరం. అయితే, గుడ్లు, చికెన్, చేపలు వంటి సమ్మర్ లో తీసుకోకపోవడం చాలా బెటర్ అని, ఇవన్నీ మరింత వేడిని పుట్టిస్తాయని చాలామంది వాదన. అయితే, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు శరీరానికి ఎన్ని ప్రయోజనాలు కల్పిస్తాయో న్యూట్రిషనిస్ట్ నమామీ అగర్వాల్ ఇన్ స్టాలో ఒక వీడియోను షేర్ చేశారు.

వేసవిలో గుడ్లు, చికెన్, చేపలు తినడం అనారోగ్యకరమనేది అపోహ. వేసవిలో ఈ ఆహార పదార్థాలను మితంగా తీసుకున్నా ఫర్వాలేదు’ అని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆహారాలు ముఖ్యమైనవని. శక్తి స్థాయిని ఎక్కువగా ఉంచడానికి వివిధ విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయని పోషకాహార నిపుణుడు తెలిపారు. “గుడ్లు ముఖ్యంగా శరీరంలో వేడిని కలిగిస్తాయి, కానీ మితంగా తింటే, అద్భుతమైన ఆరోగ్యకరమైన ఆహారాలుగా నిరూపించబడతాయి” అని ఆమె రాశారు.

ఇది కాకుండా గుడ్లు, చికెన్, చేపలు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి, రక్తపోటును నియంత్రిస్తాయి. ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాలను కాపాడుతాయి “ఈ వస్తువులన్నీ పోషక విలువలతో కూడుకున్నవి” అని ఆమె చెప్పారు.

మీరు శాఖాహారులైతే, చిక్కుళ్ళు, చిక్పీస్, బ్లాక్ బీన్స్, వేరుశెనగ, గుమ్మడికాయ విత్తనాలు, బాదం, ఎడమామ్ బీన్స్ మరియు టోఫు వంటి ఆహారాలు ప్రోటీన్ ను ఇస్తాయి. అయితే సమ్మర్ లో ఎక్కువగా నీరు తాగాలి. కొబ్బరి నీరు, పుదీనా నీరు, నిమ్మరసం, తాజా పండ్ల రసాలు, మజ్జిగతో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చికెన్, గుడ్లు, చేపలను మితంగా తినాలి కాబట్టి, పోషకాలు సమతుల్యతను అందించడానికి పండ్లు, కూరగాయలతో కూడిన భోజనం కూడా తీసుకోవడం చాలా ముఖ్యం.