Raisins Benefits: షుగర్ వ్యాధిగ్రస్తులు ఎండుద్రాక్ష తింటే షుగర్ పెరుగుతుందా? నిపుణుల అభిప్రాయాలు

కిస్మిస్ తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనలున్నప్పటికీ షుగర్ వ్యాధిగ్రస్తులు ఎండు ద్రాక్షను తీసుకునే విషయంలో కొంచెం ఆలోచిస్తుంటారు. ఎందుకంటే కిస్మిస్ తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయోమో? అనే భయం వారిని వెంటాడుతుంది. అయితే వైద్య నిపుణులు మాత్రం మధుమేహం ఉన్న ఎలాంటి ఇబ్బంది లేకుండా కిస్మిస్ ను తినొచ్చని సూచిస్తున్నారు.

Raisins Benefits: షుగర్ వ్యాధిగ్రస్తులు ఎండుద్రాక్ష తింటే షుగర్ పెరుగుతుందా? నిపుణుల అభిప్రాయాలు
Raisins

Edited By:

Updated on: Jan 04, 2023 | 5:00 PM

ఎండు ద్రాక్షను హిందీలో కిస్మిస్ అంటారు. ఇది సేమ్యా, పరమాన్నం వంటి వంటల్లో విరివిగా వాడుతుంటారు. అలాగే కొంత మంది స్నాక్స్ లా కూడా ఎండుద్రాక్షను తింటుంటారు. స్వీట్స్ చేసినప్పుడు అందులో మరిన్ని పోషకాలు, ప్రత్యేకతను జోడించడానికి కిస్మిస్ ను వేస్తుంటారు. కిస్మిస్ తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనలున్నప్పటికీ షుగర్ వ్యాధిగ్రస్తులు ఎండు ద్రాక్షను తీసుకునే విషయంలో కొంచెం ఆలోచిస్తుంటారు. ఎందుకంటే కిస్మిస్ తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయోమో? అనే భయం వారిని వెంటాడుతుంది. అయితే వైద్య నిపుణులు మాత్రం మధుమేహం ఉన్న ఎలాంటి ఇబ్బంది లేకుండా కిస్మిస్ ను తినొచ్చని సూచిస్తున్నారు. ఎందుకంటే కిస్మిస్ లో సాధారణ పండ్ల లాగే సహజ చక్కెర, కార్బొహైడ్రేట్లు ఉంటాయని చెబుతున్నారు. అలాగే ఎండు ద్రాక్షలో ఉండే ఫైబర్, విటమిన్లు, మినరల్స్ శరీరానికి మంచి చేస్తుందని పేర్కొంటున్నారు. అయితే కిస్మిస్ తినడం మంచిదే అయినా మితంగా తినాలని మాత్రం సూచిస్తున్నారు. అలాగే కిస్మిస్ తిన్నాక కార్బోహైడ్రేట్ శాతం కూడా లెక్కించుకోవాలని పేర్కొంటున్నారు. అలాగే ఎండుద్రాక్ష వల్ల కలిగే ఇతర ప్రయోజనాల గురించి కూడా తెలుసుకుందాం.

అధిక పోషకాలు

ఎండు ద్రాక్ష విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలకు మంచి మూలం. అలాగే ఐరన్ శాతం కూడా కిస్మిస్ తింటే పెరుగుతుంది. ఐరన్ వల్ల శరీరంలో ఆక్సిజన్ ప్రసరణకు ఉపయోగపడుతుంది. అలాగే ఎండుద్రాక్షలో కాల్షియం, పొటాషియం, బోరాన్ వంటి ఇతర పోషకాలు కూడా ఉన్నాయి. 

జీర్ణక్రియకు దోహదం

ఎండు ద్రాక్షలో ఉండే ఫైబర్ కు కరిగే గుణం ఉండడంతో పేగు కదలికలను ప్రోత్సహించి జీర్ణ ప్రక్రియకు సాయం చేస్తుంది. అలాగే రక్తం చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. 

ఇవి కూడా చదవండి

బరువు తగ్గుదల

డైటింగ్ చేేసే తమ ఆహారంలో ఎండు ద్రాక్షను చేర్చుకుంటే బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది. ఆహారంలో అధిక ఫైబర్ ను చేర్చాలనుకుంటే ఎండు ద్రాక్ష చక్కని పదార్థంలా ఉంటుంది. డైటింగ్ నిపుణులు అభిప్రాయం ప్రకారం అధిక ఫైబర్ తీసుకుంటే తక్కువ బరువుతో ఉంటారని పేర్కొంటున్నారు.

గుండె జబ్బుల నుంచి రక్షణ

ఎండు ద్రాక్షలో ఉండే యాంటి ఆక్సిడెంట్లు గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. అలాగే రక్తపోటును నియంత్రించి గుండె పోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి. 

ఎముకలకు బలం

ఎండ్రు ద్రాక్షలో బోరాన్ అధికంగా ఉంటుంది. ఎముకల ఆరోగ్యానికి బోరాన్ చాలా అవసరం. కిస్మిస్ ను ప్రతిరోజూ తింటే ఎముకలు గట్టి పడడమే కాకుండా బోలు ఎముకల వ్యాధి ప్రభావాన్ని తగ్గించడంతో సాయం చేస్తుంది. 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..