నల్లగా ఉన్నాయని దూరం పెట్టకండి.. ఆ సమస్యకు బ్రహ్మాస్త్రం.. డైలీ ఒకటి తిన్నారంటే తిరుగుండదిక..

క్యారెట్‌లో ఎన్నో పోషకాలు దాగున్నాయి. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.. క్యారెంట్ ఏడాది పొడవునా ఉత్పత్తి అవుతుంది.. ఎక్కువగా శీతాకాలంలో ఉత్పత్తి అయినప్పటికీ.. ఏడాది పొడవునా మార్కెట్‌లో అందుబాటులో ఉంటుంది.. అయితే.. సాధారణంగా ఎరుపు లేదా నారింజ రంగు క్యారెట్‌లను తప్పనిసరిగా తింటూ ఉంటారు. అయితే.. బ్లాక్ క్యారెట్ మీరెప్పుడూ తినకపోయినా.?

నల్లగా ఉన్నాయని దూరం పెట్టకండి.. ఆ సమస్యకు బ్రహ్మాస్త్రం.. డైలీ ఒకటి తిన్నారంటే తిరుగుండదిక..
Black Carrot

Updated on: May 23, 2024 | 12:02 PM

క్యారెట్‌లో ఎన్నో పోషకాలు దాగున్నాయి. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.. క్యారెంట్ ఏడాది పొడవునా ఉత్పత్తి అవుతుంది.. ఎక్కువగా శీతాకాలంలో ఉత్పత్తి అయినప్పటికీ.. ఏడాది పొడవునా మార్కెట్‌లో అందుబాటులో ఉంటుంది.. అయితే.. సాధారణంగా ఎరుపు లేదా నారింజ రంగు క్యారెట్‌లను తప్పనిసరిగా తింటూ ఉంటారు. బ్లాక్ క్యారెట్ ను చాలా మంది తిని ఉండరు.. అయితే.. బ్లాక్ క్యారెట్ మీరెప్పుడూ తినకపోయినా.? దాని ప్రయోజనాల గురించి తెలియకపోయినా..? ఇప్పుడు తెలుసుకోండి..

పెరుగుతున్న బరువుకు బ్లాక్ క్యారెట్‌తో చెక్ పెట్టవచ్చు.. సాధారణంగా బరువు తగ్గడం చాలా కష్టమైన పని, అందుకే చాలా మంది దీన్ని చేయడానికి దూరంగా ఉంటారు.. ఇలాంటి వారు క్యారెట్ సహాయంతో ఈ కష్టమైన పనిని కూడా సులభం చేసుకోవచ్చు..

బ్లాక్ క్యారెట్ మార్కెట్లో చాలా అరుదుగా కనిపిస్తుంది. అయితే ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది, ఎందుకంటే ఇందులో పోషకాల కొరత ఉండదు. మీరు బ్లాక్ క్యారెట్‌లను రోజూ తింటే, శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ వెజిటేబుల్‌లోని యాంటీ ఒబెసిటీ ప్రాపర్టీ బెల్లీ ఫ్యాట్‌కి శత్రువు..

బ్లాక్ క్యారెట్ బరువును ఎలా తగ్గిస్తుంది?

బ్లాక్ క్యారెట్‌లో ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, పొటాషియం, మాంగనీస్, ఐరన్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇందులో చాలా తక్కువ కేలరీలు, చక్కెర పరిమాణం ఉంటుంది. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. బ్లాక్ క్యారెట్‌లో చాలా ఫైబర్ ఉంటుంది.. ఇది చాలా కాలం పాటు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇంకా అతిగా తినకుండా నిరోధిస్తుంది. ఈ కూరగాయ పొట్ట, నడుము కొవ్వును తగ్గించడమే కాకుండా, శరీరంలోని టాక్సిన్‌లను తొలగించడం, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడం, కొలెస్ట్రాల్‌ను తగ్గించడం వంటి అనేక ఇతర ప్రయోజనాలను కూడా కలిగి ఉంది.

నల్ల క్యారెట్లను ఎలా తినాలి?

క్యారెట్‌లను తినడానికి సులభమైన మార్గం ఏమిటంటే, వాటిని బాగా కడగడం.. వాటిని నేరుగా తినడానికి మట్టి లేదా మురికిని సరిగ్గా శుభ్రం చేయకపోతే దానిలోని ఒక పొరను తీసివేయండి.

క్యారెట్‌ను తరచుగా సలాడ్‌గా ఉపయోగిస్తారు. మీరు బ్లాక్ క్యారెట్ ను టమోటా, ముల్లంగి, దోసకాయ, నిమ్మ, ఉప్పుతో కలిపి కూడా తినవచ్చు.. ఇది చాలా రుచిగా ఉంటుంది.

క్యారెట్‌లను నమలి తినడం ఇష్టం లేకుంటే శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి జ్యూస్ చేసుకోండి.. డైలీ జ్యూస్‌ను తాగితే బరువు తగ్గడంలో చాలా దోహదపడుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..