
ఎంతో మంది నోట్లో వక్కలు వేసుకుని నములుతూనే ఉంటారు. తెల్ల సున్నంతో తమలపాకు మీద రాసి ఈ వక్క ముక్కలను చుట్టి నములుతారు. దీన్నే కొన్ని పాన్ అంటారు.

టేస్ట్ మంచిగా ఉండటం కోసం దీనిలో పొగాకు కూడా వాడుతున్నారని తెలిసింది. కాబట్టి, ఇలా వక్కలు ఎక్కువగా నమలకండి. నమిలితే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.

ఇక కొన్ని దేశాల్లో వక్కను మత్తు పదార్థంగా వాడుతున్నారు. ఇక కొన్ని దీవుల్లో అయితే ఏళ్ల క్రితమే దీనిని వాడారని ఆనవాలు కూడా ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన దాని ప్రకారం ఈ వరల్డ్ లో అతిగా వాడే వాటిలో ఇది కూడా ఒకటి.

వక్కను బాగా తినడం వలన నోటి పుండ్లు కూడా వస్తాయి. ఒక్కో సందర్భంలో నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు, నోరు ఆరిపోతూ ఉంటుంది. జీర్ణ సమస్యలు కూడా ఎక్కువుతాయి. దీనిలో ఉండే సున్నం ప్రేగులకు హాని చేస్తుంది.

ఇది అప్పుడప్పుడు తింటే ఏం కాదు, కానీ రోజూ విపరీతంగా నమిలితే వచ్చే నష్టాలు ఉన్నాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి. నోటి లోపలి భాగం పూర్తిగా బిగుసుకుపోయి కదలలేకుండా ఉంటుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)