Carrot Fries: యమ్మీ యమ్మీ, క్రంచీ క్రంచీ… ఆహా ఏమి రుచి అనిపించే క్యారెట్‌ ఫ్రైస్‌ తయారీ విధానం..

అసలే చలికాలం.. వేడి వేడిగా నోట్లో ఏదైనా ఆడిస్తుంటే ఆ మజానే వేరు కదూ.! అయితే చాలా వరకు స్నాక్స్‌ ఆరోగ్యానికి హానికరంగానే ఉంటాయి. అలా కాకుండా ఆరోగ్యాన్ని అందించే స్నాక్స్‌ తీసుకుంటే భలే ఉంటుంది కదూ! ఇలాంటి స్నాక్స్‌కు క్యారెట్ ఫ్రైస్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు...

Carrot Fries: యమ్మీ యమ్మీ, క్రంచీ క్రంచీ... ఆహా ఏమి రుచి అనిపించే క్యారెట్‌ ఫ్రైస్‌ తయారీ విధానం..
Carrot French Fries
Follow us

|

Updated on: Nov 23, 2022 | 9:08 PM

అసలే చలికాలం.. వేడి వేడిగా నోట్లో ఏదైనా ఆడిస్తుంటే ఆ మజానే వేరు కదూ.! అయితే చాలా వరకు స్నాక్స్‌ ఆరోగ్యానికి హానికరంగానే ఉంటాయి. అలా కాకుండా ఆరోగ్యాన్ని అందించే స్నాక్స్‌ తీసుకుంటే భలే ఉంటుంది కదూ! ఇలాంటి స్నాక్స్‌కు క్యారెట్ ఫ్రైస్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. సహజంగా ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ అనగానే మనకు ఆలుతో చేసిన ఫ్రైస్‌ గుర్తొస్తాయి. అయితే క్యారెట్‌తో కూడా ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ చేసుకోవచ్చు. ఇంతకీ ఈ ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ను ఎలా తయారు చేసుకోవాలి.? కావాల్సిన పదార్థాలు ఏంటి.? స్టెప్‌ బై స్టెప్‌ ప్రాసెస్‌ మీకోసం..

కావాల్సిన పదార్థాలు..

* 2 నుంచి 3 క్యారెట్లు

* 1/4 టీస్పూన్ నల్ల మిరియాలు పొడి

ఇవి కూడా చదవండి

* 1 స్పూన్ మొక్కజొన్న పిండి

* రుచికి తగినంత ఉప్పు

* నూనె

తయారీ విధనం..

* మొదట 2 నుంచి 3 క్యారెట్లను తీసుకోని వాటిని సన్నగా ముక్కుల చేయండి. తర్వాత వాటిని వేడినీటిలో 3 నిమిషాలు ఉడకబెట్టండి.

* తర్వాత వాటిని నీటి నుంచి తీసివేసి వాటిని చల్లబరచండి. గిన్నెలో ఒక చెంచా కార్న్ కార్న్‌ ఫ్లోర్‌ తీసుకోండి. దానికి పావు టీస్పూన్ ఎండుమిర్చి కలపండి.

* రుచికి తగినంత ఉప్పు కలపండి.

* తర్వాత ఈ మిశ్రమంలో ఉడికించిన క్యారెట్‌లను ముంచండి.

* అనంతరం బాణిలో నూనె వేసి వేడి చేయండి. క్యారెట్‌ ఫ్రైస్‌ను వేడి నూనెలో వేయించాలి. టొమాటో సాస్‌తో సర్వ్ చేస్తే రుచి అమోఘంగా ఉంటుంది.

మరిన్ని ఫుడ్ వార్తల కోసం క్లిక్ చేయండి..