Diabetes: డయాబెటిస్‌పై మీక్కూడా ఈ అపోహలు ఉన్నాయా.? నిజాలు తెలుసుకోండి

డయాబెటిస్‌ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో ఇదీ ఒకటి. మారుతోన్న జీవన విధానం తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా డయాబెటిస్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మరీ ముఖ్యంగా భారత్‌లో డయాబెటిస్‌తో బాధపడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే డయాబెటిస్‌ విషయంలో...

Diabetes: డయాబెటిస్‌పై మీక్కూడా ఈ అపోహలు ఉన్నాయా.? నిజాలు తెలుసుకోండి
Diabetes Reduce Tips
Follow us

|

Updated on: May 07, 2024 | 9:08 PM

డయాబెటిస్‌ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో ఇదీ ఒకటి. మారుతోన్న జీవన విధానం తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా డయాబెటిస్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మరీ ముఖ్యంగా భారత్‌లో డయాబెటిస్‌తో బాధపడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే డయాబెటిస్‌ విషయంలో చాలా మందికి ఎన్నో అపోహలు ఉంటాయి. ఇంతకీ ఆ అపోహలు ఏంటి.? అసలు నిజాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* డయాబెటిస్‌కు సంబంధించి చాలా మందిలో ఉన్న అపోహల్లో తీపి తింటే డయాబెటిస్‌ వస్తుందని ఒకటి. అయితే చక్కెర తిన్నంత మాత్రన డయాబెటిస్‌ వస్తుంది అనడంలో నిజం లేదు. తీపి పదార్థాల కన్నా కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే పనీర్, ఛీజ్, బర్గర్ల వంటి ఫాస్ట్ ఫుడ్స్ తింటేనే డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా. అయితే స్వీట్లలో నూనె పదార్థాలు కూడా ఉంటాయి కాబట్టి డయాబెటిస్ ఉన్నవాళ్లు వాటి జోలికి పోవద్దని చెబుతున్నారు.

* మధుమేహం ఉంటే అన్నం తినకూడదని చాలా మంది భావిస్తుంటారు. అయితే ఇందులో నిజం లేదు. అన్నానికీ, రక్తంలో ఉండే చక్కెరకూ పెద్దగా సంబంధం లేదు. అయితే అన్నంతో పాటు నూనె పదార్థాలైన వేపుడు కూరలు, పిండివంటలు తీసుకుంటే కష్టం. లో కార్బ్ డైట్ వల్ల ఉపయోగం ఏమీ లేదు.

* ఓట్స్‌ తీసుకుంటే డయాబెటిస్‌ తగ్గుతుందని అనుకోడం అపోహ మాత్రమే. ఓట్స్ ను ప్రాసెస్ చేసి అమ్ముతారు కాబట్టి ఓట్స్ తిన్న వెంటనే గ్లూకోజ్ పెరుగుతుంది.

* రాగులు, జొన్నల వంటి చిరు ధాన్యాలు తీసుకుంటే డయాబెటిస్ తగ్గుతుందని అంటుంటారు. అయితే తృణ ధాన్యాల వల్ల డయాబెటిస్‌ కంట్రోల్‌లో ఉంటుంది. కానీ పూర్తిగా తగ్గడం అనేది ఉండదు.

* ఇక డయాబెటిస్‌ ఉన్న వాళ్లు పండ్లు తినకూడదని భావిస్తుంటారు. డయాబెటిస్ ఉన్నవాళ్లు కూడా తినొచ్చు. ఈ పండ్లలో ఉండే పిండిపదార్థం వేరు. చక్కెర వ్యాధిలో చక్కెర వేరు. కాబట్టి పండ్లను తీసుకుంటే పెద్దగా సమస్యగా లేకపోయినా, అతిగా తీసుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..