Stress: ఒత్తిడి శారీరక ఆరోగ్యంపై ఇంత ప్రభావం చూపుతుందా.? చాలా డేంజర్

దీర్ఘకాలంగా ఒత్తిడితో ఇబ్బంది పడుతున్న వారిలో హృదయ స్పందన రేటు పెరగడం, కండరాలు ఒత్తిడికి గురికావడం, శ్వాసపరమైన సమస్యలు వస్తున్నాయని నిపుణులు గుర్తించారు. ఒత్తిడి శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుందని అంటున్నారు. అంతేకాకుండా అధిక రక్తపోటు దారి తీస్తుందని, ఇది కాలక్రమేణా గుండెపోటు సమస్యకు కూడా కారణంగా మారుతుందని...

Stress: ఒత్తిడి శారీరక ఆరోగ్యంపై ఇంత ప్రభావం చూపుతుందా.? చాలా డేంజర్
stress
Follow us

|

Updated on: May 07, 2024 | 9:11 PM

కొన్నేళ్ల క్రితం వరకు అసలు ఒత్తిడి అనేది ఒక ఆరోగ్య సమస్యగా మారుతుందని బహుశా ఎవరూ ఊహించకపోయి ఉండొచ్చు. మారిన జీవన విధానం, వర్క్‌ కల్చర్‌ కారణంగా ఒత్తిడి అనేది ప్రస్తుతం ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. చాలా మంది ఈ మానసిక సమస్యతో సతమతమవుతున్నారు. విపరీతమైన ఒత్తిడి కారణంగా ఎన్నో రకాల మానసిక సమస్యలు వేధిస్తున్నాయి. అయితే ఒత్తిడి కేవలం మానసిక సమస్యలకే పరిమితం కాకుండా శారీరక సమస్యలకు సైతం దారి తీస్తోంది నిపుణులు చెబుతున్నారు.

దీర్ఘకాలంగా ఒత్తిడితో ఇబ్బంది పడుతున్న వారిలో హృదయ స్పందన రేటు పెరగడం, కండరాలు ఒత్తిడికి గురికావడం, శ్వాసపరమైన సమస్యలు వస్తున్నాయని నిపుణులు గుర్తించారు. ఒత్తిడి శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుందని అంటున్నారు. అంతేకాకుండా అధిక రక్తపోటు దారి తీస్తుందని, ఇది కాలక్రమేణా గుండెపోటు సమస్యకు కూడా కారణంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఒత్తిడి జీర్ణ సమస్యలు, నిద్రలేమి, తలనొప్పి వంటి సమస్యలకు కూడా కారణమవుతుందని అంటున్నారు.

శరీరం, మనన్సు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయని. తీవ్రమైన ఒత్తిడి శారీరక సమస్యలకు దారి తీస్తుందని అంటున్నారు. ఒకరంగా ఒత్తిడి అనేది కొన్ని సందర్భాల్లో ఉత్పాదకతను పెంచుతుందని అంటున్నా. మోతాదుకు మించి ఉంటే మాత్రం తీవ్రమైన సమస్యకు దారి తీస్తుందని చెబుతున్నారు. ఒత్తిడి కారణంగా ప్రేగులు, దగ్గు లేదా బర్ప్స్, మింగడంలో సమస్యలు, శ్వాస ఆడకపోవడం, రక్తపోటు, రక్తంలో చక్కెర హెచ్చుతగ్గులకు కూడా కారణమవుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.

ఇక ఒత్తిడిని క్రమంగా తగ్గించుకునేందుకు పలు చిట్కాలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా తీసుకునే ఆహారం మొదలు జీవన విధానంలో మార్పులతో ఒత్తిడిని జయించవచ్చు. అలాగే ప్రతీ రోజూ కచ్చితంగా యోగా, మెడిటేషన్‌ వంటి వాటిని అలవాటు చేసుకోవాలి. అలాగే కొద్దిసేపైనా వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Latest Articles
పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్‌‌గా టీమిండియా ఫ్యూచర్ కీపర్
పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్‌‌గా టీమిండియా ఫ్యూచర్ కీపర్
కాలికి నల్ల దారం ఎందుకు కట్టుకుంటారో తెలుసా.?
కాలికి నల్ల దారం ఎందుకు కట్టుకుంటారో తెలుసా.?
నానబెట్టిన ఎండు ద్రాక్ష నీటిని ఇలా తాగితే సగం రోగాలు పరార్!
నానబెట్టిన ఎండు ద్రాక్ష నీటిని ఇలా తాగితే సగం రోగాలు పరార్!
'అందరినీ ఒకేసారి అరెస్ట్ చేయండి'.. జైల్ భరోకి కేజ్రీవాల్ పిలుపు..
'అందరినీ ఒకేసారి అరెస్ట్ చేయండి'.. జైల్ భరోకి కేజ్రీవాల్ పిలుపు..
తొలి 7 మ్యాచ్‌ల్లో ఒకే విజయం.. 15 రోజుల్లో మారిన ఆర్‌సీబీ
తొలి 7 మ్యాచ్‌ల్లో ఒకే విజయం.. 15 రోజుల్లో మారిన ఆర్‌సీబీ
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
అక్కడ వర్షాలకు వజ్రాలు దొరుకుతాయి.. రత్నాల వేటలో స్థానికులు..
అక్కడ వర్షాలకు వజ్రాలు దొరుకుతాయి.. రత్నాల వేటలో స్థానికులు..
ముగ్గురు చెప్పుల వ్యాపారుల ఇళ్లలో ఐటీ సోదాలు.. ఓ గది తెరవగా!
ముగ్గురు చెప్పుల వ్యాపారుల ఇళ్లలో ఐటీ సోదాలు.. ఓ గది తెరవగా!
పాపం అమ్మాయిలు.! స్నాక్స్ తింటుండగా ఏంటి ఇలా జరిగింది..
పాపం అమ్మాయిలు.! స్నాక్స్ తింటుండగా ఏంటి ఇలా జరిగింది..
ఈ 5 లక్షణాలు.. కడుపు క్యాన్సర్‌కు ముందస్తు సంకేతాలు కావొచ్చు..
ఈ 5 లక్షణాలు.. కడుపు క్యాన్సర్‌కు ముందస్తు సంకేతాలు కావొచ్చు..