Kanda-Vankay Curry: గోదావరి జిల్లా స్టైల్లో రుచికరమైన కంద, వంకాయ పులుసు తయారీ..

|

Jan 22, 2022 | 1:57 PM

Kanda-Vankay Curry Recipe: తెలుగు వారు వాడే కూరగాయలలో కంద(elephant foot yam)కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అడవులలో తిరిగే మునులు "కందమూలాలు" తిని బతికేవారని చదువుతూ..

Kanda-Vankay Curry: గోదావరి జిల్లా స్టైల్లో రుచికరమైన కంద, వంకాయ పులుసు తయారీ..
Kanda Vankaya Pulusu Recipe
Follow us on

Kanda-Vankay Curry Recipe: తెలుగు వారు వాడే కూరగాయలలో కంద(elephant foot yam)కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అడవులలో తిరిగే మునులు “కందమూలాలు” తిని బతికేవారని చదువుతూ ఉంటాం. కందతో అనేక రకాల కూరలు తయారు చేస్తారు. కంద వేపుడు, కందపులుసు, కంద పచ్చడి వంటి కూరలు ఆంధ్రావారి లోగిళ్ళలో చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా కార్తీక మాసం వచ్చిందంటే చాలు కంద బచ్చలి కూరకు వేరివేరీ డిమాండ్. అంతేకాదు కంద వంకాయ పులుసు ప్రత్యేక సందర్భాల్లో కోనసీమ వాసులు తప్పని సరిగావండుకునే కూర. ఈరోజు కంద వంకాయ పులుసు తయారీ విధానం తెలుసుకుందాం..

తయారీకి కావలసిన పదార్ధాలు:

కంద
వంకాయలు
ఉల్లి (పేస్ట్)
ధనియాలు
జీలకర్ర
లవంగాలు
యాలకులు
వెల్లుల్లి
అల్లం
పచ్చిమిర్చి
కారం
ఉప్పు
పసుపు
చింతపండు గుజ్జు
బెల్లం (చిన్న ముక్క)
నూనె
కరివేపాకు

పోపు సామాగ్రి
మినపప్పు
జీలకర్ర
ఎండుమిర్చి
కర్వేపాకు

తయారీ విధానం: ముందు కంద చెక్కు తీసుకుని శుభ్రంగా కడగి మీడియం సైజ్ ముక్కల్లో కట్ చేసుకోవాలి. మిక్సి తీసుకుని అందులో ఉల్లిపాయలు , ధనియాలు, జీలకర్ర, లవంగాలు , యాలకులు , వెల్లుల్లి , అల్లం వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. అనతరం వంకాయలను సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని నూనె వేసి.. వేడి ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకుని వేయించిన తర్వాత అందులో ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసుకుని పచ్చి స్మెల్ పోయేవరకూ వేయించుకోవాలి. అంతరం కట్ చేసి పెట్టుకున్న కంద ముక్కలు, వంకాయ ముక్కలు వేసి.. కొంచెం సేపు మీడియం ప్లేమ్ లో వేయించుకోవాలి. తర్వాత కారం, పసుపు, ఉప్పు వేసుకుని మరికొంచెం సేపు వేయించి.. ఇప్పుడు చింతపండు గుజ్జులో నీరు పోసుకుని దానిని వేయించిన కంద, వంకాయ మిశ్రమంలో వేసుకోవాలి. అందులో కొంచెం బెల్లం ముక్క వేసుకుని ఉప్పు, పులుపు చూసుకుని.. తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని.. మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి. అంతే రుచికరమైన కంద, వంకాయ పులుసు రెడీ.. కోనసీమ వాసులు ఈ కంద వంకాయ పులుసుని అన్నం లోకే కాదు.. గారెల్లో కూడా తింటారు.

అయితే కంద పేరు వినగానే గుర్తుకి వచ్చేది దాని ముఖ్యమైన లక్షణం దురద. పచ్చి కందని తినడానికి ప్రయత్నిస్తే నోరంతా ఒకటే దురద వేస్తుంది. దుంపకూరలు అన్నీ పచ్చివి కొరికితే కొద్దో గొప్పో దురద వేస్తాయి. కాని కందలో ఈ దురద లక్షణం విపరీతం. అందుకనే కందకు లేని దురద కత్తిపీటకెందుకో అనే సామెత వాడుకలోకి వచ్చింది. కందలో రెండు రకాలు ఉన్నాయి. తీట కందని ముక్కలుగా కోసి, నీళ్లల్లో వండి, ఆ నీళ్లని పారబోస్తే, ఆ దురద పోతుంది. లేదా కంద ముక్క్లని బాగా నీళ్లల్లో కడిగి, తరువాత వాటిని మజ్జిగలోనో, చింతపండు రసంలోనో ఉడకబెడితే దురద తగ్గిపోతుంది.

Also Read:   గంటకు 414 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన బుగాటీ కారు.. నెట్టింట వీడియో వైరల్‌..