Healthy Recipe: ఎనర్జీ డ్రింక్స్ వద్దు.. మన తాతల ‘ఉక్కు’ శరీరాల వెనుక అసలైన సూపర్ ఫుడ్ ఇదే..

ఆధునిక కాలంలో మనం రంగురంగుల ప్యాకెట్లలో దొరికే ప్రాసెస్డ్ ఫుడ్ వైపు పరుగులు తీస్తున్నాం. కానీ, మన తాతయ్యలు, బామ్మలు 80 ఏళ్ల వయసులో కూడా ఉక్కులా దృఢంగా ఉండటానికి కారణం వారు తీసుకున్న సంప్రదాయ ఆహారాలే. తాజాగా జీవనశైలి నిపుణుడు ల్యూక్ కౌటిన్హో వెలుగులోకి తెచ్చిన 'తిజాన్' అనే గోవా గంజి ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. మర్చిపోయిన ఈ సూపర్ ఫుడ్ విశిష్టత ఏంటో ఇప్పుడు చూద్దాం..

Healthy Recipe: ఎనర్జీ డ్రింక్స్ వద్దు.. మన తాతల ఉక్కు శరీరాల వెనుక అసలైన సూపర్ ఫుడ్ ఇదే..
Tizann Recipe

Updated on: Mar 17, 2026 | 9:02 PM

రాగి పిండి, స్వచ్ఛమైన బెల్లం కొబ్బరి పాల మేళవింపే ఈ ‘తిజాన్’. ఇది కేవలం గంజి మాత్రమే కాదు, ఒక సహజ సిద్ధమైన మెడిసిన్. చిన్న పిల్లల ఎదుగుదల నుండి వృద్ధుల ఎముకల పుష్టి వరకు.. ఈ ఆహారం చేసే మేలు అంతా ఇంతా కాదు. గ్లూటెన్ లేని ఈ గంజి ఎలా తయారు చేయాలి? వ్యాయామానికి ముందు దీనిని ఎందుకు తాగాలి? అనే ఆసక్తికర విషయాలను ఇప్పుడు వివరంగా చూద్దాం..

ఎనర్జీ డ్రింక్స్ వద్దు..

రాగి : ఇందులో కాల్షియం, ఐరన్ మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఎముకల ఆరోగ్యానికి ఇది తిరుగులేని వనరు.

బెల్లం : ఖనిజాలను అందిస్తూ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. చక్కెర కంటే ఎంతో సురక్షితమైన తీపి ఇది.

కొబ్బరి పాలు : ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తూ శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి.

కావలసిన పదార్థాలు:

రాగి పిండి: ½ కప్పు

కొబ్బరి పాలు: 2 కప్పులు

తురిమిన బెల్లం: ½–¾ కప్పు

యాలకుల పొడి: ½ టీస్పూన్

డ్రై ఫ్రూట్స్: జీడిపప్పు, బాదం ముక్కలు

ఉప్పు: చిటికెడు

తయారీ విధానం :

ముందుగా రాగి పిండిని ఒక కప్పు నీటిలో కలిపి, ఎక్కడా ఉండలు లేకుండా జారుడు మిశ్రమంలా తయారు చేసుకోండి.

గోరువెచ్చని నీటిలో బెల్లాన్ని కరిగించి, మలినాలు లేకుండా వడకట్టి పక్కన పెట్టుకోండి.

ఒక బాణలిలో రాగి మిశ్రమం, కొబ్బరి పాలు, బెల్లం నీరు చిటికెడు ఉప్పు వేసి మధ్యస్థ మంట మీద ఉడికించండి.

రాగి ముద్దలు కట్టకుండా గరిటెతో కలుపుతూనే ఉండాలి. గంజి లాగా చిక్కగా మారే వరకు సుమారు 8-10 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడకనివ్వండి.

చివరగా యాలకుల పొడి, పైన తరిగిన బాదం, జీడిపప్పు ముక్కలు చల్లుకుంటే వేడివేడి తిజాన్ సిద్ధం!

చిన్న చిట్కా: వర్షాకాలం లేదా చలికాలంలో ఈ గంజిని వేడివేడిగా తాగితే రోగనిరోధక శక్తి (Immunity) అద్భుతంగా పెరుగుతుంది.

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. మీ శరీర తత్వానికి అనుగుణంగా ఆహార మార్పులు చేసుకోండి.

Follow Us