
అత్తిపండ్లు (అంజీర్)లో అనేకపోషకాలు దాగున్నాయి.. అంజీర్ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, పొటాషియం, ఇనుము, రాగి అనేవి అంజీర్‌లో లభించే కొన్ని స్థూల.. సూక్ష్మపోషకాలు. ఇది శరీరాన్ని అనేక వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుందని డైటీషియన్లు చెబుతున్నారు.
ఉదయం ఖాళీ కడుపుతో రాత్రిపూట నీటిలో నానబెట్టిన అంజీర్ పండ్లను తినడం వల్ల బరువు తగ్గుతారు. అంజీర్ పండ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి.. కాబట్టి అవి బరువు తగ్గడానికి సహాయపడతాయి.
ఐరన్ (ఇనుము) లోపంతో బాధపడేవారు అంజీర్ పండ్లను తినాలి.. ఎందుకంటే అవి హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతాయి. అంజీర్ పండ్లను తినడం ద్వారా, మీరు అనేక వ్యాధుల నుండి దూరంగా ఉండవచ్చు.
అంజీర్ పండ్లు తినడం వల్ల మీ ముఖం ప్రకాశవంతంగా మారుతుంది. కాబట్టి మీరు రెగ్యులర్ గా అంజీర్ పండ్లు తినవచ్చు.. తద్వారా చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.
అత్తి పండ్లలోని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. షుగర్ కూడా కంట్రోల్ ఉంటుంది..
అంజీర్ పండ్లు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.. అధిక ఫైబర్ ఉండటం వల్ల మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి.
అంతేకాకుండా శరీర రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. పలు సమస్యలతో పోరాడటంలో సహాయపడుతుంది.
అంజీర్ లోని పోషకాలు గుండె ఆరోగ్యం మెరుగుపడేందుకు సహాయపడతాయి.. ఎముకల ఆరోగ్యం కూడా బలోపేతం అవుతుంది.
ప్రతి రోజూ ఉదయాన్నే నానబెట్టిన ఒక అంజీర్ పండు తినడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందని డైటిషీయన్లు చెబుతున్నారు.
అంతేకాకుండా.. కావాలంటే.. రాత్రిపూట పాలతో కలిపి తీసుకోవచ్చు.. ఎలా తిన్నా.. డబుల్ ప్రయోజనాలను పొందవచ్చు..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..