Soaked Almonds: రోజూ బాదంపప్పుని తింటే వైరల్ ఇన్ఫెక్షన్స్‌తో పోరాడే సామర్ధ్యంతో పాటు ఎన్ని ప్రయోజంలో తెలుసా

|

Jun 10, 2021 | 3:36 PM

Almonds Health Benefits: ప్రస్తుతం కరోనా ను జయించడానికి తినే ఆహార పదార్ధాల్లో ఒకటిగా నిలిచింది బాదం పప్పు. ఈ బాదంపప్పును నేరుగా తింటారు లేదా తీపి వంటకాలు..

Soaked Almonds: రోజూ బాదంపప్పుని తింటే వైరల్ ఇన్ఫెక్షన్స్‌తో పోరాడే సామర్ధ్యంతో పాటు ఎన్ని ప్రయోజంలో తెలుసా
Almonds
Follow us on

Almonds Health Benefits: ప్రస్తుతం కరోనా ను జయించడానికి తినే ఆహార పదార్ధాల్లో ఒకటిగా నిలిచింది బాదం పప్పు. ఈ బాదంపప్పును నేరుగా తింటారు లేదా తీపి వంటకాలు మరియు పిండివంటల్లో వాడతారు. రాత్రి నానబెట్టిన బాదంపప్పును మర్నాడు ఉదయం తింటారు. ఇలా రాత్రినానబెట్టిన బాదంపప్పును తినడం ఆరోగ్యానికి మంచిదని ఇలా నానబెట్టి దానిమీద ఉన్న పై పొరను తీసివేయడం ద్వారా దాని తొక్కుపై ఉన్న విషపదార్థాలను తొలగించివేస్తుందని చెప్పారు. ఇప్పుడు బాదం తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..!

*రోజూ బాదంపప్పు తింటే రోజుకు విటమిన్ ఇ లభిస్తుంది. ఇందులోని ‘బి’ విటమిన్లు ఒత్తిడిని దూరం చేస్తాయి.
*బాదంలో శాచురేటెడ్ కొవ్వు శాతం తక్కువగా వుండటంతో బరువును తగ్గించుకోవచ్చు.
*బాదంలో ప్రోటీన్లు, అత్యధిక న్యూట్రిషన్ గుణాలు ఉండటం వలన ఇవి తీసుకుంటే వేరే పోషక పదార్థాలు, మెడిసిన్లు వాడాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
*బాదం పప్పుల్ని తీసుకోవడంతో గుండెపోటును అరికట్టడంలోనూ, గుండె వ్యాధులను నివారించటంలోనూ భేష్‌గా పనిచేస్తుంది.
*రోజూ బాదం గింజలు తింటే వైరల్ ఇన్ఫెక్షన్స్‌తో పోరాడే సామర్ధ్యం పెరుగుతుంది.
*ఆస్టియోపొరోసిస్ అదుపు చేయటంలో బాదంలో లభించే ఎంతో సహాయపడుతుంది.
*ఎముకలను పటిష్టం చేస్తుంది. శరీర అవయవాలకు, కణాలకు ఆక్సిజన్‌ను చేరవేస్తుంది.
*అలసటగా ఉన్నప్పుడు నాలుగు బాదంపప్పులు తింటే వెంటనే శక్తి లభిస్తుంది.
*మెదడు చురుకుగా పని చేయటానికి రోజూ రెండు లేదా మూడు బాదంపప్పులు రాత్రి నానబెట్టి తర్వాత రోజూ ఉదయాన్నే తింటే సరిపోతుంది.
*పెద్ద ప్రేగు కాన్సర్ నియంత్రణలోనూ బాదం చురుకుగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న చోట బల్బ్ పెడితే వెలుగుతున్న వైనం.. భిన్నాభిప్రాయాలు వ్యక్తం