Kaju Benefits: ఆరోగ్యంగా ఉండేందుకు డ్రైఫ్రూట్స్ తీసుకోవడం చాలామంచింది. అలాంటి డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు ఒకటి.. దీనిని పెద్దల నుంచి పిల్లల వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు టీతో ఇవ్వడానికి ఏం లేకపోతే కాల్చిన జీడిపప్పు (Cashew Nut Benefits) ను స్నాక్స్‌గా అందించవచ్చు. దీనిని ఆరోగ్యకరమైన చిరుతిండిగా ఉపయోగిస్తారు. జీడిపప్పులో విటమిన్లు, ప్రొటీన్లు, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. జీడిపప్పును రోజూ తినడం వల్ల శరీరంలో ఐరన్, ఫైబర్, ఫోలేట్, మెగ్నీషియం, ఫాస్పరస్, సెలీనియం, కాల్షియం లోపాలను తీర్చుకోవచ్చు. జింక్ లోపాన్ని తీర్చడానికి జీడిపప్పు తినవచ్చు. జీడిపప్పు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీడిపప్పు అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.
జీడిపప్పు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
1- బరువును నియంత్రిస్తుంది: లావుగా ఉన్నవారు బరువు పెరుగుతారనే భయంతో జీడిపప్పును తినరు. అయితే జీడిపప్పును పరిమిత పరిమాణంలో తీసుకోవడం వల్ల ఊబకాయం తగ్గుతుంది. జీడిపప్పులో ఫైబర్, మెగ్నీషియం ఉంటాయి. దీనిలో ఉన్న కొవ్వులు, కార్బోహైడ్రేట్లు జీవక్రియను పెంచుతాయి. ఇది బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.
2- చర్మాన్ని ఆరోగ్యవంతంగా మారుస్తుంది: జీడిపప్పు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. జీడిపప్పు తినడం వల్ల ముడతల సమస్య తొలగిపోతుంది. విటమిన్ ఇ, యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు జీడిపప్పులో ఉన్నాయి. ఇవి మీ చర్మాన్ని అనేక సమస్యల నుంచి కాపాడతాయి.
3- జుట్టును బలంగా మారుస్తుంది: జీడిపప్పులో జింక్, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల జుట్టు ఆరోగ్యవంతంగా ఉంటుంది. రోజూ జీడిపప్పు తినడం వల్ల జుట్టు మృదువుగా, ఒత్తుగా మారుడంతోపాటు మెరుస్తుంది.
4- బలహీనత దూరం: శరీరాన్ని దృఢంగా మార్చుకోవడానికి మీరు అన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. ఇటువంటి మూలకాలు జీడిపప్పులో పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరాన్ని బలంగా మారుస్తాయి. జీడిపప్పు తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి, బలం చేకూరుతాయి. దీంతోపాటు ఎముకలు దృఢంగా మారుతాయి. జీడిపప్పులో కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు బలహీనపడకుండా కాపాడతాయి. ఎముకల సమస్యతో బాధపడేవారు రోజూ జీడిపప్పు తినాలి.
5- మధుమేహాన్ని నియంత్రిస్తుంది: జీడిపప్పులో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి పువ్వులో ఉండే గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తాయి. డయాబెటిక్ రోగులకు జీడిపప్పు తీసుకోవడం ప్రయోజనకరంగా పరిగణిస్తారు.
6- జీర్ణక్రియ మెరుగుపడుంది: జీడిపప్పు ఫైబర్‌కు మంచి మూలం. దీని వినియోగం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీడిపప్పు తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్య, మలబద్ధకం కూడా తగ్గుతాయి. జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి జీడిపప్పు తినండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
Also Read: