Cabbage: ఓరి దేవుడా.! క్యాబేజీలో ఇంత మ్యాటర్ ఉందా.. ఇది తెలిస్తే అస్సలు ముట్టుకోరు..

క్యాబేజీ దొరికింది కదా అని పచ్చిగా తినేస్తున్నారా.? అయితే కాస్త ఆగండి.! అలా తినడం వల్ల లేనిపోని రోగాలు కొనితెచ్చుకున్నట్టే. దీనిపై న్యూరాలజిస్ట్ హెచ్చరికలు జారీ చేశారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి ఇక్కడ

Cabbage: ఓరి దేవుడా.! క్యాబేజీలో ఇంత మ్యాటర్ ఉందా.. ఇది తెలిస్తే అస్సలు ముట్టుకోరు..
Cabbage

Updated on: Dec 29, 2025 | 1:58 PM

మూర్ఛ బ్రెయిన్‌కు సంబంధించిన ఒక వ్యాధి. మెదడు పనితీరుకు సంబంధించి ఏదైనా ఆటంకం ఏర్పడినప్పుడు ఫిట్స్‌ వస్తుంది. ఫిట్స్‌ వచ్చినప్పుడు.. అవయవాలు వణకడం, ఆకస్మికంగా పడిపోవడం, తదేకంగా చూడటం, ఆందోళన, స్పృహ కోల్పోవడం, సైకోసిస్ వంటి లక్షణాలు కనిపిస్తాయంటున్నారు వైద్యులు. ఫిట్స్ చిన్న వయసులో బాధించడానికి పలు కారణాలని అంటున్నారు. అలాగని.. పెద్దయ్యాక రాదని చెప్పలేం. ఇది జీవితంలో ఎప్పుడైనా రావొచ్చంటున్నారు నిపుణులు. ఇది వారసత్వంగా తల్లితండ్రుల నుంచి సంక్రమిస్తుందా? ఆహారం ద్వారా మెదడులోకి చేరే పురుగులు కారణమా?

తల్లిదండ్రులకు మూర్ఛ సమస్య ఉంటే అది పిల్లలకు వచ్చే ప్రమాదం ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలంటున్నారు నిపుణులు. కొన్నిసార్లు మూర్ఛ వ్యాధిగ్రస్థులను ఆసుపత్రికి తీసుకెళ్లినా.. చికిత్స చివరి వరకు కొనసాగించకుండా మధ్యలోనే వదిలేస్తారంటున్నారు. ఈ కారణంగా వ్యాధి మరింత తీవ్రంగా మారుతుంది. అలాకాకుండా.. సమయానికి చికిత్స అందిస్తే 80 నుంచి 90 శాతం మూర్ఛ రోగులలో ఈ వ్యాధి కంట్రోల్‌ అవుతుందని చెబుతున్నారు. అలాగే క్యాబేజ్‌ ఆకులను వండకుండా పచ్చిగా తినడం వల్ల టీనియా సోలియం అనే పురుగు గుడ్లు మెదడులోకి చేరతాయని వాటి కారణంగా ఏర్పడే ఇన్ఫెక్షన్ తో మూర్చవ్యాధి రావచ్చని హెచ్చరించారు. న్యూరో సిస్టి సెర్‌కోసిస్‌ నివారించదగ్గ ఇన్‌ఫోక్షన్‌ అని ఢిల్లీ ఎయిమ్స్‌ న్యూరాలజిస్ట్ డాక్టర్‌ ప్రియాంక సెహ్రావత్‌ తెలిపారు. ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే ఈ సమాచారాన్ని మేం మీకు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.