Instant Dosa Recipe: దోస(Dosa) పసందైన అల్పాహారం అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే రెగ్యులర్ దోశ తయారీకి కొంచెం సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో రుచికరమైన ఆరోగ్యకరమైన ఓట్స్ దోశను (Oats Dosa) ఇనిస్టెంట్ గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈరోజు వీకెండ్ స్పెషల్ అల్పాహారంగా ఈజీగా తయారు చేసే ఓట్స్ ఇనిస్టెంట్ దోశ రెసిపీ మీ కోసం..
కావాల్సిన పదార్ధాలు :
ఓట్స్ ఒక కప్పు
గోధుమ పిండి – కొంచెం
ముంబై రవ్వ – ఒక టేబుల్ స్పూన్
ఉల్లిపాయ ముక్కలు
పచ్చి మిర్చి
అల్లం తురిమింది
కర్వేపాకు చిన్న గా కట్ చేసింది
పెరుగు కావాలిన మొత్తంలో
ఉప్పు- రుచికి తగినంత
మిరియాల పొడి- చిటికెడు
జీలకర్ర కొంచెం
తయారీ విధానం: ముందుగా ఓట్స్ ను మిక్సీ గిన్నెలో వేసుకుని.. అందులో కొన్ని మెంతులు వేసుకుని పొడి చేసుకోవాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని గోధుమ పిండి, ముంబై రవ్వం, పెరుగు తగినంత ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. తర్వాత మిరియాల పొడి, అల్లం తురుము వేసుకోవాలీ. ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత.. అందులో కొంచెం నీరు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఓట్స్ మిశ్రమాన్ని సుమారు 15 నిమిషాల సేపు నానబెట్టాలి. అనంతరం ఈమిశ్రమంలో తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ముక్కలు వేసుకుని కలుపుకోవాలి. అనంతరం ఈ ఓట్స్ మిశ్రమాన్ని పక్కకు పెట్టి.. స్టౌ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. పాన్ వేడి ఎక్కిన అనంతరం దోశలు వేసుకోవాలి. కొబ్బరి చట్నీ లేదా టమాటా చట్నీతో వేడి వేడిగా ఓట్స్ ఇనిస్టెంట్ దోశలను సర్వ్ చేస్తే.. ఆహా ఏమి రుచి అని అంటూ తినడం ఖాయం.