Diabetes: డయాబెటిస్‌తో బాధపడుతున్నారా.? కంటి సమస్యలు రాకూడదంటే..

కొందరిలో నరాలు సైతం బలహీనంగా మారుతాయి. ఇక షుగర్‌ కంట్రోల్‌లో లేకపోతే.. కంటి చూపు సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల న్యూరోపతి, నెఫ్రోపతి, పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్, కార్డియోవాస్కులర్ సమస్యలు వస్తాయి. రెటినోపతి వల్ల కంటి చూపు సమస్యలు వస్తాయి. అయితే షుగర్‌ సమస్యతో బాధపడేవారికి భవిష్యత్తులో...

Diabetes: డయాబెటిస్‌తో బాధపడుతున్నారా.? కంటి సమస్యలు రాకూడదంటే..
Diabetes
Follow us

|

Updated on: Jun 17, 2024 | 2:43 PM

ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడతోన్న వ్యాధుల్లో డయాబెటిస్‌ ప్రధానమైంది. మరీ ముఖ్యంగా భారత దేశంలో డయాబెటిస్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒక్కసారి డయాబెటిస్ బారిన పడితే తగ్గుడం అంత సులభమైన విషయం కాదు. డయాబెటిస్‌ను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం తప్పదని నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్‌ను మొదట్లోనే సీరియస్‌గా తీసుకోకపోతే క్రమంగా శరీరంలోని అవయవాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

కొందరిలో నరాలు సైతం బలహీనంగా మారుతాయి. ఇక షుగర్‌ కంట్రోల్‌లో లేకపోతే.. కంటి చూపు సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల న్యూరోపతి, నెఫ్రోపతి, పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్, కార్డియోవాస్కులర్ సమస్యలు వస్తాయి. రెటినోపతి వల్ల కంటి చూపు సమస్యలు వస్తాయి. అయితే షుగర్‌ సమస్యతో బాధపడేవారికి భవిష్యత్తులో కంటి సమస్యలు రాకుండా ఉండాలంటే తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాలని చెబుతున్నారు. అవేవంటంటే..

* షుగర్‌ వ్యాధితో బాధపడుతున్న వారు క్రమంతప్పకుండా మందులను వాడడం ఎంత ముఖ్యమో, షుగర్‌ పరీక్ష చేయించుకోవడం కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. చక్కెర స్థాయిలు, లిపిడ్ ప్రొఫైల్‌లు, రక్తపోటులో ఏమాత్రం తేడాల వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉంటే కంటి శుక్లం సమస్య వచ్చే అవకాశం తగ్గుతుంది.

* డయాబెటిస్‌ బారిన పడిన వారు చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇందుకోసం కచ్చితంగా వ్యాయామాన్ని అలవాటుగా మార్చుకోవాలి. కంటి ఒత్తిడిని తగ్గించుకోవడానికి కంటి సంబంధిత వ్యాయామాలు చేయాలి.

* ఇక కంటి ఆరోగ్యం మెరుగుపడడానికి పండ్లు, ఆకు కూరలు, తృణధాన్యాలతో సమతుల్యమైన, పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారంలో విటమన్‌ ఏ, సీ, ఈలతో పాటు.. యాంటీఆక్సిడెంట్లు, జింక్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలి.

* క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలి. ఒకవేళ ఏదైనా కంటి సంబంధిత సమస్య ఉంటే ముందుగానే గుర్తించాలి. ఇలా చేయడం వల్ల చికిత్స కూడా త్వరగా తీసుకోవచ్చు.

* వీటన్నింటితో పాటు ధూమపానం, మద్యపానం అలవాట్లను పూర్తిగా మానేయాలి. ఈ రెండు కంటిశుక్లం, మాక్యులర్ డీజెనరేషన్ వంటి ఇతర సమస్యల ప్రమాదాన్ని పెంచుతాయి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..