పసిడి ధరలు పట్ట పగ్గాలు లేకుండా పరుగులు తీస్తున్నాయి. దాంతో ముఖ్యంగా మహిళలకు బంగారు ఆభరణాలు ఖరీదైనవిగా మారుతున్నాయి. దీనికి మంచి ప్రత్యామ్నాయం గిల్టు నగలు, అదేనండో రోల్డ్‌గోల్డ్ జ్యూవెలరీ అందుబాటులోకి వచ్చాయి. డ్రెస్సింగ్ స్టైల్‌కు తగ్గట్టు రకరకాల మోడల్స్, మెటల్ ఆభరణాలు మార్కెట్లో లభిస్తున్నాయి. ఈ ఆర్టిఫిషియల్ ఆభరణాలు అందరికీ అందుబాటులో ఉంటాయి. కృత్రిమ ఆభరణాలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా తయారీదారులు కూడా సరికొత్త డైజన్లలో ఈ నగలను తయారు చేస్తున్నారు. కానీ, వీటి తయారీలో వాడే కొన్ని మెటల్స్ కారణంగా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. చర్మం ఎరుప్పెక్కడం, దద్దుర్లు వంటివి ఇబ్బంది పెడుతుంటాయి.
స్త్రీలు వివిధ రకాల చర్మాలను కలిగి ఉంటారు. దాంతో గిల్టు నగలు వేసుకోవటం వల్ల కొంతమందికి అలెర్జీలు కలుగుతుంటాయి. మరికొందరికి ఎటువంటి చర్మ ప్రతిచర్య ఉండకపోవచ్చు. దీనికి పరిష్కారంగా మహిళలు కృత్రిమ ఆభరణాలను ధరించటం పూర్తిగా మానుకోలేరు. అయితే కొన్ని చిట్కాలను అనుసరించటం ద్వారా అలెర్జీ ప్రతిచర్యను తగ్గించవచ్చు.
ఆర్టిఫిషియల్ నగలు అందరికీ చర్మతత్వాలకు సరిపోవు. ఆర్టిఫిషియల్ నగల అలెర్జీ కారణంగా చర్మంపై ఎర్రటి దద్దుర్లు, దురద, మంట.. వంటి సమస్యలు ఎదురవుతాయి. ప్రతిసారీ మీరు దద్దుర్లు, ఎరుపును ఎదుర్కొంటుంటే, అప్పుడు కృత్రిమ ఆభరణాలు ధరించకుండా ఉండటం మంచిది. లేదంటే, ఆర్టిఫిషియల్ నగల అలర్జీ ఉన్నవారు వాటిని వేసుకునే ముందు పౌడర్, మాయిశ్చరైజర్, క్యాలమైన్ లోషన్స్ వంటివి ముందుగానే మీ చర్మానికి రాసుకుంటే మంచిది. ఇవి మీ చర్మాన్ని రక్షిస్తాయి. మెటల్ ఎఫెక్ట్ ప్రభావం మీ చర్మంపై పడకుండా చూసుకుంటాయి. ఆర్టిఫిషియల్ నగల వల్ల చర్మంపై దురదగా అనిపిస్తే.. ఆ ప్రదేశంలో కలబంద గుజ్జును అప్లై చేసుకోవాలి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు సమస్య నుంచి ఉపశమనం అందిస్తాయి.
అలాగే, గిల్టు నగలు వేసుకునే వారు ఆ నగలు తడిసినా లేదంటే చెమట పట్టినా ముందుగా ఆరబెట్టాలి. వాటిని అలాగే బాక్సుల్లో పెట్టి స్టోర్ చేయకూడదు. లేదంటే, వాటిని కాటన్ లో పెట్టి స్టోర్ చెయ్యడం అలవాటు చేసుకొండి. ఇలా చేస్తే నగలు దెబ్బతినడంతో పాటు, స్కిన్ అలర్జీలకు కారణం అవుతుంది. ఇలాంటి ఆర్టిఫిషియల్ జ్యూవెలరీతో అలర్జీ సమస్య ఉన్నవారు నగలు ధరించే ముందు ఇంట్లోనే వాటిపై ఓ కోటింగ్ ట్రాన్స్‌పరెంట్ నెయిల్ పాలిష్ వేసుకుని వాడుకుంటే బెటర్. ఇలా చేస్తే మెటల్ ప్రభావం చర్మంపై పడదని నిపుణులు చెబుతున్నారు.
అలాగే, కొంతమంది చోకర్, నెక్‌పీస్ వంటి నగలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కానీ గిల్టు నగలతో ఇలాంటి టైట్‌జ్యూవెలరీ వేసుకోకుండా ఉండటమే మంచిది. నగల అలెర్టీ ఉన్నవారు టైట్‌గా ఉండే జ్యూయలరీకి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. మెడకు టైట్‌గా పెట్టే నగల వల్ల గాలి ఆడక అల్జీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి వారు లాంగ్ చెయిన్స్, హారాలు వేసుకుంటే మంచిది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి