Lifestyle: జిమ్‌కి వెళ్లకుండానే బరువు తగ్గొచ్చు.. ఎలాగో తెలుసా.?

పలు అధ్యయనాల్లో వెల్లడైన విషయాల వరకు ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వాకింగ్‌ చేయడం వల్ల బరువుతగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. నడకను ప్రతీరోజూ అలవాటుగా మార్చుకోవాలని సూచిస్తున్నారు. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో అడపాదడపా ఉపవాసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రోజూ కొన్ని...

Lifestyle: జిమ్‌కి వెళ్లకుండానే బరువు తగ్గొచ్చు.. ఎలాగో తెలుసా.?
Weight Loss

Updated on: Mar 11, 2024 | 11:01 PM

ఊబకాయం ఇటీవల ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఇదీ ఒకటి. మారుతోన్న జీవన విధానం కారణంగా చాలా మంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. అయితే శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును తగ్గించడానికి తక్షణ చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. సాధారణంగా బరువు తగ్గడం అనగానే మనలో చాలా మంది జిమ్‌లో వర్కవుట్స్‌ చేయాలనే భావనలో ఉంటారు. అయితే ఇది అందరికీ కుదరకపోవచ్చు. అలా కాకుండా జిమ్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఇంట్లోనే చిన్ని చిన్న టిప్స్‌ పాటించడం ద్వారా అధిక బరువు సమస్యకు చెక్‌ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ టిప్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పలు అధ్యయనాల్లో వెల్లడైన విషయాల వరకు ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వాకింగ్‌ చేయడం వల్ల బరువుతగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. నడకను ప్రతీరోజూ అలవాటుగా మార్చుకోవాలని సూచిస్తున్నారు. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో అడపాదడపా ఉపవాసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రోజూ కొన్ని గంటలపాటు ఉపవాసం ఉండాలి. బరువు తగ్గడానికి ఇది చాలా ట్రెండింగ్ ట్రిక్ అయినప్పటికీ ఇది అందరికీ కాదు. అందువల్ల, దీనిని ప్రయత్నించే ముందు, ఖచ్చితంగా మీ ఆరోగ్య నిపుణుడి సూచనలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఊబకాయం దరిచేరకుండా ఉండాలంటే త్వరగా జీర్ణమయ్యే ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక నిద్రలేమి కూడా ఊబకాయం అకస్మాత్తుగా పెరగడానికి కారణంగా చెబుతున్నారు. తగినంత గంటలు నిద్రపోకపోవడం, ఊబకాయంకు మధ్య సంబంధం ఉన్నట్లు ఎన్నో అధ్యయనాల్లో వెల్లడయ్యాయి. ప్రతీరోజూ కనీసం 6 నుంచి 7 గంటల నిద్రపోవడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..