-
-
రాత్రి పడుకోలేకపోతే, పగటిపూట నిద్రపోకుండా ఉండాలి. ఒకరోజు ఈ పద్ధతిని పాటిస్తే ఇలానే కొనసాగుతుంది. పగలు నిద్రపోకుండా ఉండాలంటే బెడ్ దగ్గరకి వెళ్లకుండా ఉండాలి. బెడ్షీట్, దిండులకు దూరంగా ఉంటే చాలు.
-
-
నిద్రపోయే ముందు మీ స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లను ఉపయోగించడం తగ్గించాలి. ఎందుకంటే అవి మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. ఇటువంటి కార్యకలాపాలు మెదడును కూడా ఉత్తేజపరుస్తాయి, తద్వారా మీరు నిద్రపోవటం కష్టమవుతుంది.
-
-
పడుకునే ముందు ఆహారంపై శ్రద్ధ వహించాలి. రాత్రి సమయంలో కడుపు తేలికగా ఉండాలి. రాత్రి సమయంలో కాఫీ, టీ వంటి వాటికి దూరంగా ఉండాలి. దీని ప్రభావం గంటల తరబడి ఉంటుంది. కాబట్టి నిద్రపోవడం కష్టమవుతుంది. నిద్రపోయే ముందు వెచ్చని పాలు తాగితే మంచిది.
-
-
పడుకునే ముందు మద్యం సేవించడం మానుకోండి ఎందుకంటే అది నిద్రకు భంగం కలిగిస్తుంది. ఇది స్లీప్ అప్నియా వంటి సమస్యలను పెంచుతుంది. గురక మొదలవుతుంది.
-
-
నిద్రకు పోవాలనుకుంటున్న గది చల్లగా ఉండేలా చూసుకోవాలి. మాట్రెస్, దిండు శుభ్రంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. వెన్నునొప్పి ఉన్నవాళ్లు కిందపడుకోవడం మంచిది.
Priyanka Chopra : న్యూయార్క్లో రెస్టారెంట్ ఓనరైన బాలీవుడ్ బ్యూటీ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హోటల్ ఫొటోలు..