Lifestyle: మీరు వాడుతోన్న కర్పూరం అసలైందేనా.? ఇలా చెక్‌ చేయండి..

|

Oct 27, 2024 | 10:25 AM

ప్రస్తుతం మార్కెట్లో కల్తీ వస్తువుల తయారీ పెరిగిపోతోంది. ప్రతీ వస్తువను కల్తీగా మార్చేస్తున్నారు కేటుగాళ్లు. ఈ నేపథ్యంలో మార్కెట్లో కల్తీ కర్పూరం దందా సాగుతోంది. అయితే ఇంతకీ మీరు ఉపయోగిస్తున్న కర్పూరం అసలైందేనా.? నకిలీదా కొన్ని సింపుల్ చిట్కాల ద్వారా తెలుసుకోవచ్చు. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Lifestyle: మీరు వాడుతోన్న కర్పూరం అసలైందేనా.? ఇలా చెక్‌ చేయండి..
Camphor
Follow us on

ప్రతీ ఒక్కరి ఇంట్లో కచ్చితంగా కర్పూరం ఉండాల్సిందే. పూజ సమయంలో కచ్చితంగా ఉపయోగించే కర్పూరం ఇంట్లోని నెగిటివిటీని దూరం చేస్తుందని వాస్తు పండితులు సైతం చెబుతుంటారు. గాలిలో ఉండే బ్యాక్టీరియాను తొలగించడంతో పాటు, నెగిటివ్‌ ఎనర్జీని దూరం చేస్తుందని చెబుతుంటారు. అయితే అన్ని వస్తువులు నకిలీగా మారుతోన్న ప్రస్తుత తరుణంలో కొందరు కేటుగాళ్లు కర్పూరంను కూడా కల్తీ చేసేస్తున్నారు. దర్జాగా మార్కెట్లో నకిలీ కర్పూరంను విక్రయిస్తున్నారు. ఇంతకీ నకిలీ కర్పూరాన్ని ఎలా గుర్తించాలి.? ఇప్పుడు తెలుసుకుందాం..

నకిలీ కర్పూరాన్ని రంగు ఆధారంగా గుర్తించవచ్చు. సాధారణంగా నకిలీ కర్పూరం తెలల్గా మెరిసిపోదు. కాస్త లేత గోధుమ రంగులో లేదా కొద్దిగా పసుపు పచ్చ రంగులో ఉంటుంది. తెల్ల రంగు వచ్చేందుకు కర్పూరంలో సఫ్రోల్ అనే పదార్థం కలుపుతారు. ఇలాంటివి కలిపిన కర్పూరాన్ని వెలిగించడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయి. అలాగే తల రిగడం, రక్తపోటులో హెచ్చుతగ్గులు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

వాసన ఆధారంగా కూడా కల్తీ కర్పూరాన్ని అంచనా వేయొచ్చు. నకిలీ కర్పూరం వాసన చూస్తే జలుబు వచ్చినప్పుడు మనం ఉపయోగించే బామ్ రంగులో ఉంటుంది. ఇలాంటి కల్తీ కర్పూరం వల్ల ముక్కులో మంట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముక్కులో దురద వంటి సమస్యలు వస్తాయి. అసలైన కర్పూరాన్ని కాల్చిన తర్వాత ఎలాంటి అవశేషాలు మిగలవు. ఒకవేళ కర్పూరం కాల్చిన తర్వాత బూడిద మిగిలితే అది పూర్తిగా నకిలీ అని అర్థం చేసుకోవాలి. నిజమైన కర్పూరం వేగంగా కరిగిపోదని గుర్తు పెట్టుకోవాలి.

కల్తీ కర్పూరాన్ని కాల్చిన సమయంలో జ్వాల కాస్త నారింజ రంగును పోలి ఉంటుంది. అదే అసలైన కర్ఫూరాన్ని కాల్చితే.. మంచి సువాసన కలిగిన నల్లని పొగను విడుదల చేస్తుంది. స్వచ్ఛమైన కర్పూరాన్ని నీటిలో వేస్తే అది అడుగుకు చేరుతుంది. దీనికి కారణం స్వచ్ఛమైన కర్పూరం బరువుగా ఉండడమే. నీటి మీద తేలితే అది కల్తీ అని అర్థం చేసుకోవాలని చెబుతున్నారు.

మరిన్ని లైప్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..