Immunity: వర్షాకాలం వ్యాధులకు ఇలా చెక్.. చిన్నారుల్లో ఇమ్యూనిటీ పెంచే ఫుడ్స్‌

సీజన్‌ మారుతోంది. మొన్నటి వరకు మండే ఎండలతో ఇబ్బంది పడ్డ ప్రజలకు వాతావరణం చల్లబడడం ఊరటనిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తొలకరి జల్లులు మొదలయ్యాయి. దీంతో వాతావరణం ఒక్కసారి చల్లబడింది. అయితే ఇదే సమయంలో వ్యాధులు కూడా పెరిగే అవకాశాలు ఎక్కువయ్యాయి. సాధారణంగా వర్షాకాలం సీజనల్‌ వ్యాధులు ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి..

Immunity: వర్షాకాలం వ్యాధులకు ఇలా చెక్.. చిన్నారుల్లో ఇమ్యూనిటీ పెంచే ఫుడ్స్‌
Kids Immunity

Updated on: Jun 22, 2024 | 9:50 AM

సీజన్‌ మారుతోంది. మొన్నటి వరకు మండే ఎండలతో ఇబ్బంది పడ్డ ప్రజలకు వాతావరణం చల్లబడడం ఊరటనిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తొలకరి జల్లులు మొదలయ్యాయి. దీంతో వాతావరణం ఒక్కసారి చల్లబడింది. అయితే ఇదే సమయంలో వ్యాధులు కూడా పెరిగే అవకాశాలు ఎక్కువయ్యాయి. సాధారణంగా వర్షాకాలం సీజనల్‌ వ్యాధులు ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తగ్గడంతో పిల్లల్లో వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఇమ్యూనిటీ పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* వర్షాకాలంలో చిన్నారులు వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ఉదయాన్నే పసుపు కలిపిన పాలను అందించాలి. పసుపులో యాంటీ బ్యాక్టిరియల్‌ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఎంతగానో ఉపయోపగపడతాయి. పసుపులోని కర్కూమిన్..యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు సీజనల్‌ వ్యాధుల బారిన పడకుండా కాపాడుతాయి.

* ప్రతీ రోజూ బాదంను ఇవ్వడం ద్వారా చిన్నారుల్లో ఇమ్యూనిటీ పెరుగుతుంది. బాదంలో ఉండే పవర్‌ఫుల్‌ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వ్యాధుల బారిన పడకుండా కాపాడడంలో ఉపయోగపడతాయి. చల్లటి వాతావరణంలో వచ్చే సాధారణ వ్యాధుల నుంచి బయటపడేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

* చాలా మంది పెరుగు అనగానే జలుబు అవుతుందనే భావనలో ఉంటారు. అయితే వర్షాకాలంలో పెరుగు తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇందులోని ప్రొబయోటిక్‌ పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అయితే పెరుగులో దానిమ్మ, బెర్రీ, బాదం వంటివి కలుపుకొని తీసుకోవడం వల్ల మరింత మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

* వర్షాకాలంలో వచ్చే వ్యాధులకు చెక్‌ పెట్టడంలో వెల్లుల్లి కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లిలోని యాంటీ మైక్రోబ్రియల్‌, ఇమ్యూన్‌ బూస్టింగ్‌ గుణాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడతాయి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us