Hang Over: హ్యాంగ్‌ ఓవర్‌ వేధిస్తే.. న్యాచురల్‌ టిప్స్‌తో ఇలా సింపుల్‌గా చెక్‌ పెట్టండి.

తలపట్టేసినట్లు అయ్యి, రోజంతా ఇబ్బందిగా ఉంటుంది. తలనొప్పితో పాటు, అసిడిటీ, విశ్రాంతి లేకపోవడం, అలసట వంటి సమస్యలు వెంటాడుతుంటాయి. దీనినే హ్యాంగ్‌ ఓవర్‌గా పిలుస్తుంటారు. అయితే ఈ హ్యాంగ్‌ఓవర్‌కు చెక్‌ పెట్టేందుకు మెడిసిన్స్‌ కూడా అందుబాటులో ఉంటాయి. మరి మెడిసిన్స్‌ కాకుండా సహజంగా హ్యాంగ్‌ ఓవర్‌కు ఎలా చెక్‌ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Hang Over: హ్యాంగ్‌ ఓవర్‌ వేధిస్తే.. న్యాచురల్‌ టిప్స్‌తో ఇలా సింపుల్‌గా చెక్‌ పెట్టండి.
Hangover

Updated on: Dec 28, 2023 | 8:19 PM

ఆల్కహాల్‌ ఆరోగ్యానికి హానికరమని తెలిసినా మద్యం ప్రియులు మాత్రం మానడానికి ఇష్టపడరు. ఇదే చివరిసారి అనుకుంటూ మద్యం సేవిస్తుంటారు. అయితే మద్యం సేవించడం వల్ల ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక అతిగా మద్యం సేవించిన తర్వాతి రోజు హ్యాంగ్ ఓవర్‌ వేధిస్తుంటుంది.

తలపట్టేసినట్లు అయ్యి, రోజంతా ఇబ్బందిగా ఉంటుంది. తలనొప్పితో పాటు, అసిడిటీ, విశ్రాంతి లేకపోవడం, అలసట వంటి సమస్యలు వెంటాడుతుంటాయి. దీనినే హ్యాంగ్‌ ఓవర్‌గా పిలుస్తుంటారు. అయితే ఈ హ్యాంగ్‌ఓవర్‌కు చెక్‌ పెట్టేందుకు మెడిసిన్స్‌ కూడా అందుబాటులో ఉంటాయి. మరి మెడిసిన్స్‌ కాకుండా సహజంగా హ్యాంగ్‌ ఓవర్‌కు ఎలా చెక్‌ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం..

* సాధారణంగా మద్యం సేవిస్తే శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. అతిగా మద్యం సేవిస్తే.. శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. ఈ కారణంగానే తల పట్టేసినట్లు కావడం, తల తిరగడం వంటి సమస్య వేధిస్తుంది. ఈ సమస్యకు చెక్‌ పెట్టాలంటే అతిగా మద్యం సేవించిన తర్వాతి రోజు వీలైనంత వరకు నీటిని ఎక్కువగా తీసుకోవాలి. రాత్రి నీటిని ఎక్కువగా తాగాలి. ఒకవేళ ఉదయం హ్యాంగ్‌ఓవర్‌ భావన కలిగితే ఓఆర్‌ఎస్‌ వంటి డ్రింక్స్‌ను తీసుకోవాలి.

* హ్యాంగోవర్‌ను తగ్గించడంలో అల్లం దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది. హ్యాంగ్‌ ఓవర్‌తో బాధపడే వారు అల్లం టీని తాగితే సత్ఫర ఫలితం ఉంటుంది. అల్లంతో పాటు ఉప్పు కలిపి తీసుకుంటే సమస్యకు మరింత త్వరగా పరిష్కారం లభిస్తుంది.

* మద్యం సేవించడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్‌కు గురవుతుందనే విషయం తెలిసిందే. అలాగే శరీరం ఎలక్ట్రోలైట్స్‌ను కోల్పోతాయి. కాబట్టి వీటిని శరీరంలో బ్యాలెన్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కొబ్బరి నీరును తీసుకోవాలి. కొబ్బరి నీళ్లలో తక్కువ మొత్తంలో చక్కెర, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. దీంతో హ్యాంగోవర్ కూడా సులభంగా తగ్గిపోతుంది.

* హ్యాంగోవర్‌ బారిన పడితే సిట్రిక్‌ పండ్లను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. నిమ్మరసం తీసుకోవడం వల్ల హ్యాంగోవర్‌కు చెక్‌ పెట్టొచ్చు. తలనొప్పి సమస్య కూడా నిమ్మరసం తీసుకుంటే తగ్గుతుంది. ఇలాంటి సింపుల్ చిట్కాలు పాటించడం ద్వారా అధిక మద్యం తీసుకోవడం వల్ల తలెత్తే హ్యాంగోవర్‌ సమస్యకు చెక్‌ పెట్టొచ్చు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..