Scalp Itching: తలలో దురదగా ఉందా.? ఎన్ని షాంపూలు వాడినా ఫలితం లేదా.? ఇలా చేసి చూడండి..

|

Jan 10, 2023 | 8:45 AM

కొందరికి తలలో ఎప్పుడూ దూరదగా ఉంటుంది. మరీ ముఖ్యంగా చలికాలం ఈ సమస్య ఎక్కువగా వేధిస్తుంటుంది. కాలక్రమేణా ఈ సమస్య జుట్టు రాలడానికి కారణంగా మారుతుంటుంది. వాయు, నీటి కాలుష్యం కారణంగా ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. అయితే ఈ సమస్య ప్రారంభంలో ఉండగానే నివారణ చర్యలు తీసుకుంటే ఫలితం..

Scalp Itching: తలలో దురదగా ఉందా.? ఎన్ని షాంపూలు వాడినా ఫలితం లేదా.? ఇలా చేసి చూడండి..
Scalp Itching
Follow us on

కొందరికి తలలో ఎప్పుడూ దూరదగా ఉంటుంది. మరీ ముఖ్యంగా చలికాలం ఈ సమస్య ఎక్కువగా వేధిస్తుంటుంది. కాలక్రమేణా ఈ సమస్య జుట్టు రాలడానికి కారణంగా మారుతుంటుంది. వాయు, నీటి కాలుష్యం కారణంగా ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. అయితే ఈ సమస్య ప్రారంభంలో ఉండగానే నివారణ చర్యలు తీసుకుంటే ఫలితం ఉంటుంది. అలా కాకుండా ఆలస్యం చేస్తే మాత్రం ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని నేచురల్‌ టిప్స్‌ పాటించడం ద్వారా ఈ సమస్యకు చెక్‌ పెట్టవచ్చు. ఇంతకీ తలలో దురద సమస్యకు సహజ పద్ధతుల్లో ఎలా చెక్‌ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం..

* తలలో దురద సమస్యకు యాపిల్‌ సైడర్‌ మంచి రెమెడిగా ఉపయోగపడుతుంది. నీటిలో కొంచెం యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ కలిపి ఆ మిశ్రమాన్ని తలకి పట్టించాలి. ఇలా చేసిన కాసేపటి తర్వాత నీటితో శుభ్రంగా కడిగేయాలి. ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

* మింట్‌ ఆయిల్‌, ఆలివ్‌ ఆయిల్‌తో తల దురద సమస్య నుంచి బయటపడొచ్చు. మింట్‌ ఆయిల్‌ తలకు చల్లటి ఫీలింగ్ కలిగిస్తుంది. ఈ ఆయిల్స్‌ను తలపై రుద్దుకోవాలి. ఇలా చేసిన గంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. వారంలో రెండు నుంచి మూడుసార్లు ఇలా చేస్తే దురద సమస్యకు చెక్‌ పెట్టొచ్చు.

ఇవి కూడా చదవండి

* వెంట్రుకల ఆరోగ్యాన్ని కాపాడడంలో అలోవెరా కీలక పాత్ర పోషిస్తుందనే విషయం తెలిసిందే. అందుకే అలోవెరాతో చేసిన షాంపూలను వాడాలని నిపుణులు చెబుతుంటారు. అలోవెరా జెల్‌ని నీటితో కడిగేసి దానిని తలపై మసాజ్‌ చేసుకోవాలి. ఇలా చేసిన 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

* ఉల్లిపాయ రసం కూడా తల దురద సమస్యకు మంచి ఔషధంలా ఉపయోగపడుతుంది. ఇందుకోసం ముందుగా కొంచెం ఉల్లిపాయ రసాన్ని తీసుకోవాలి. అనంతరం ఓ కాటన్‌ క్లాత్‌ను తీసుకొని తలకు అప్లై చేసుకోవాలి. అనంతరం కాసేపటి తర్వాత వెచ్చని నీటితో కడిగేస్తే బెస్ట్ రిజల్ట్స్‌ ఉంటాయి.

* వేప చుండ్రు సమస్యలకు దివ్వౌషధం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందుకోసం ముందుగా కొన్ని వేపాకులను తీసుకోని నీటిలో ఉడకబెట్టాలి. అనంతరం అందులోని ఆ రసంతో తలపై మసాజ్‌ చేసుకోవాలి. అరగంట తర్వాత తల స్నానం చేస్తే దురద సమస్య పరార్‌ అవుతుంది.

* ఆలివ్‌ ఆయిల్‌ని గోరువెచ్చగా చేసి తలకు పట్టించి మసాజ్‌ చేసుకోవాలి. రాత్రంతా అలాగే ఉంచిన తర్వాత ఉదయం గోరువెచ్చని నీటితో శుభ్రం కడగాలి. ఇలా క్రమంతప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..