Stomach Ache: ప్రస్తుతకాలంలో తీసుకునే ఆహారం.. జీవనశైలి మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అలాంటి అనారోగ్య సమస్యల్లో కడుపు నొప్పి కూడా ఒకటి. కడుపు నొప్పికి అనేక కారణాలు ఉండవచ్చు. కానీ ఈ సమస్యకు బలమైన చికిత్స అవసరం. మసాలా పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల కడుపులో గ్యాస్, ఎసిడిటీ, మలబద్దకం వంటి సమస్యల వల్ల కూడా కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది. ఇది ఒక సాధారణమైన సమస్యగా చాలా మంది భావిస్తూ ఉంటారు. అలాగే ఈ సమస్య చిన్న పిల్లల నుండి పెద్దల వరకు దాదాపుగా అందరికి అప్పుడప్పుడూ వస్తూ ఉంటుంది. కడుపు నొప్పి వల్ల మనకు కలిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. కొందరిలో ఈ సమస్య మరీ తీవ్రంగా కూడా ఉంటుంది. చాలా మంది ఈ సమస్య నుండి బయట పడడానికి కడుపు నొప్పి మాత్రలను వేసుకుంటూ ఉంటారు.
అలాంటి కడుపునొప్పికి హోమ్ రెమిడిస్ ద్వారా చెక్ పెట్టవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. వాము కొన్ని నిమిషాల్లో కడుపు నొప్పి సమస్యను తొలగిస్తుంది. సాధారణంగా వాము అందరి ఇళ్లల్లో ఉంటుంది. దీనితో కడుపు నొప్పి సమస్యను అధిగమించవచ్చు. దీనివల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. అంతేకాకుండా పూర్తిగా సురక్షితమైనవి కూడా అని నిపుణులు అంటున్నారు. ఎంతటి భయంకరమైన కడుపు నొప్పి అయినా సరే ఒక్కసారి వాము తింటే చాలు.. క్షణాల్లో నయం అవుతుంది. ఈ వంటింటి చిట్కా చాలా అద్భుతంగా పని చేస్తుంది. దీనిని వాడడం వల్ల కేవలం 5 నిమిషాల్లోనే మనం కడుపునొప్పి సమస్య నుంచి బయటపడవచ్చు.
అంతేకాకుండా వామును ఉపయోగించడం వల్ల కడుపులో నొప్పి, గ్యాస్, మలబద్దకం, నులిపురుగులు, ఎసిడిటీ వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. దీనిలో ఉండే థైమోల్ అనే పదార్థం పొట్టలో గ్యాస్ తయారయ్యే ప్రక్రియను నిలిపి వేయడంలో సహాయపడుతుంది. పూర్వకాలంలో కూడా మన పెద్దలు జీర్ణసంబంధిత సమస్యలను తగ్గించడంలో వామునే ఎక్కువగా ఉపయోగించే వారు. కడుపులో నొప్పి మాత్రమే కాక మంటగా అనిపించినప్పుడు కూడా వాము తిని వెంటనే ఉపశమనం పొందవచ్చు. నమలడంతో పాటు నీటితో కూడా తీసుకోవచ్చు.