Headache: తలనొప్పి భరించలేకపోతున్నారా..! అయితే ఈ 5 హోం రెమిడిస్ తక్షణ ఉపశమనం..

|

Aug 27, 2021 | 12:39 PM

Headache: తలనొప్పి ఒక సాధారణ సమస్య. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అటువంటి పరిస్థితిలో మాత్రలు తీసుకునే

Headache: తలనొప్పి భరించలేకపోతున్నారా..! అయితే ఈ 5 హోం రెమిడిస్ తక్షణ ఉపశమనం..
Headache
Follow us on

Headache: తలనొప్పి ఒక సాధారణ సమస్య. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అటువంటి పరిస్థితిలో మాత్రలు తీసుకునే బదులు మీరు ఇంటి నివారణలను అవలంబించవచ్చు. ఇది తలనొప్పి నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. ఈ 5 హోం రెమిడిస్‌ చక్కగా పనిచేస్తాయి. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.

1. నీరు ఎక్కువగా తాగాలి – కొన్ని అధ్యయనాల ప్రకారం శరీరానికి కావలసిన నీరు అందకపోతే తలనొప్పి వస్తుంది. ఇది మీ ఏకాగ్రతను కూడా ప్రభావితం చేస్తుంది చిరాకును పెంచుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు నీరు ఎక్కువగా తాగాలి. ఇది మీకు తలనొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

2. అల్లం టీ – ఒక అధ్యయనంలో అల్లం తలనొప్పి నుంచి బయటపడేస్తుంది. మీరు ఒక కప్పు అల్లం టీ తాగవచ్చు. మీరు నుదిటి, మెడ, వెనుక కూడా అల్లం నూనెను మసాజ్ చేయవచ్చు.

3. నిద్రపోండి – నిద్ర లేకపోవడం అనేక విధాలుగా ఆరోగ్యానికి హానికరం. ఇది మీకు తలనొప్పిని తేవడమే కాకుండా అలసటను కూడా తీసుకొస్తుంది. అప్పుడు ఏకైక మార్గం నిద్ర పోవడమే.

4. విశ్రాంతి – విశ్రాంతి లేకపోవడం కూడా తలనొప్పికి ప్రధాన కారణం కావచ్చు. ఒత్తిడిని తగ్గించే వ్యాయామాలు చేయడం వల్ల తలనొప్పిని తగ్గించవచ్చు. యోగా, శ్వాస వ్యాయామాలు లేదా ధ్యానం తలనొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు క్రమం తప్పకుండా యోగా సాధన చేయవచ్చు. ఇది అనేక ఇతర ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి మిమ్మల్ని రక్షస్తుంది.

5. ఐస్ క్యూబ్‌ – మీరు టవల్‌లో చుట్టిన ఐస్ క్యూబ్‌లను ఉపయోగించవచ్చు. మీ తలపై 15 నిమిషాల పాటు ఉంచి, 15 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోండి. ఇది తలనొప్పి నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది.

అరోమాథెరపీ – లావెండర్ వంటి వాసనలు తలనొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. మీకు తరచుగా తలనొప్పి ఉంటే నూనె కొంచెం తలపై వేసి మర్దన చేయాలి. కొద్దిగా ఉపశమనం ఉంటుంది.

Viral Video: మీరెప్పుడైనా ఇలాంటి బైక్‌ నడిపారా..! వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు..

Sampradaya Bhojanam: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ‘సంప్రదాయ భోజన’ కార్యక్రమం ప్రారంభం…

అబ్బుర పరుస్తున్న సామాన్యుడు.. ఇతడి హాబీకి హ్యాట్సాప్..ఇంతకీ ఏం చేశాడు..?? వీడియో