Rice Water : అన్నం వండిన తర్వాత గంజిని పడేస్తున్నారా.. అది తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా

|

Jun 23, 2021 | 4:28 PM

Rice Water : రైస్ కుక్కర్లు రాకముందు ప్రతి ఇంట్లో అన్నం వండి వార్చేవారు.. అలా అన్నం వార్చే సమయంలో వచ్చిన గంజిని కొంతమంది పెద్దలు ఉప్పు , నిమ్మరసం, బెల్లం ముక్క...

Rice Water : అన్నం వండిన తర్వాత గంజిని పడేస్తున్నారా.. అది తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా
Rice Water
Follow us on

Rice Water : రైస్ కుక్కర్లు రాకముందు ప్రతి ఇంట్లో అన్నం వండి వార్చేవారు.. అలా అన్నం వార్చే సమయంలో వచ్చిన గంజిని కొంతమంది పెద్దలు ఉప్పు , నిమ్మరసం, బెల్లం ముక్క , పచ్చి మిర్చి టెస్టుకు తగినట్లుగా ఏదోకటి కలిపి వేడి వేడిగా తాగేవారు. అప్పుడు గంజిలో ఉన్న పోషకాలు శరీరానికి అందేవి.. దాహం తీరేది. అయితే కాలంతో పాటే వచ్చిన మార్పుల్లో భాగంగా తినే తిండిలో కూడా అనేక మార్పులు వచ్చాయి. గంజిని పక్కన పెట్టి.. టీ, కాఫీలు చేరాయి. ఇప్పుడు గంజిని వృథాగా పడేస్తున్నారు. అయితే పోషకాహార నిపుణులు గంజితో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని.. పడేసే ముందు ఒక్కసారి ఆలోచించమని చెబుతున్నారు. ఈరోజు గంజిలో ఉన్న పోషకాలను గురించి తెలుసుకుందాం..

*గంజి తాగడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది.
*శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది.
*జ్వరంతో ఉన్నవారు గంజి తాగితే.. శక్తి వస్తుంది. జ్వరం తగ్గుముఖం పడుతుంది.
*గంజిలో ఖనిజాలు, విటమిన్లు, అమైనో ఆమ్లాలు ఉన్నాయి.
* కడుపులో మంటతో బాధపడేవారికి ఇది దివ్య ఔషధం
* గంజిలోని కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తినిస్తాయి.
*జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది.
*మలబద్ధకాన్ని దూరం చేస్తుంది.
*వాంతులు, విరేచనాలతో బాధపడేవారు గంజిని తాగితే శరీరానికి పోషకాలు అందుతాయి.
* ఇది డయేరియాను తగ్గించడమే కాకుండా ఉదర సంబంధ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

గంజితో ఆరోగ్యాన్ని కాదు.. అందాన్నీ కూడా పెంచుకోవచ్చు.:

*చర్మాన్ని మృదువుగా ఆరోగ్యంగా ఉంచేందుకు గంజి సహాయపడుతుంది.
*చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. చర్మ వ్యాధులను తగ్గిస్తుంది.
*ఈ గంజిని తలకు పట్టిస్తే.. జుట్టు పట్టులా మెరుస్తుంది.
*జుట్టు రాలడం తగ్గుతుంది.
* జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుందట గంజి..

Also Read: అమ్మమ్మ చేతి కమ్మని వంట… కోడిగుడ్డుతో జున్ను కూర తయారీ ఎలా అంటే..