Skin Care Tips: దీపావళి పండుగ కోసం రెడీ అవుతున్నారా.. ఈ హోమ్ ఫేషియల్‌ను ఇంట్లోనే రెడీ చేసుకోండి.. పార్లర్ ఖర్చు ఆదా అవుతుంది..

|

Oct 07, 2022 | 1:09 PM

అందంగా కనిపించాలని అనుకుంటే బ్యూటీ పార్లర్ల చుట్టు తిరగాల్సిన అవసరం లేదు.. ఈ చిన్న.. చిన్న బ్యూటీ టిప్స్‌తో మరింత బ్యూటీగా మారొచ్చు..

Skin Care Tips: దీపావళి పండుగ కోసం రెడీ అవుతున్నారా.. ఈ హోమ్ ఫేషియల్‌ను ఇంట్లోనే రెడీ చేసుకోండి.. పార్లర్ ఖర్చు ఆదా అవుతుంది..
Home Facial
Follow us on

దీపావళి పండుగ వచ్చేస్తోంది. దీప మాళికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్ళు, ఈ దివ్య దీపావళి సోయగాలు. అయితే ఈ సందర్భంగా అంతా నిత్య నూతనంగా కనిపించాలని అంతా ఆశ పడుతుంటారు. కొత్త బట్టలతోపాటు మెరిసిపోయేందుకు రెడీ అవుతుంటారు. ఇప్పటికే బతుకమ్మ, దసర ముగిసింది. దీపావళి పండుగ కోసం సిద్దమవుతుంటారు. వివాహిత స్త్రీలు ప్రత్యేకంగా అలంకరణ, వస్త్రధారణపై శ్రద్ధ చూపే సందర్భం, చేతులకు గోరింట వేయడం నుంచి  మొదలు..  అందమైన ముఖం వరకు అంతా సిద్దం చేసుకుంటారు. కానీ బ్యూటీ పార్లర్లలో ఫేషియల్స్ కోసం చాలా ఖర్చు చేస్తారు. దీని కారణంగా చాలా మంది మహిళలు దాని నుంచి దూరంగా ఉండేవారి సంఖ్య ఈమధ్య కాలంలో పెరిగిపోయింది. అయితే ఇప్పుడు బ్యూటీ పార్లర్ల చుట్టు తిరగకుండానే బ్యూటీగా మారొచ్చు. పార్లర్‌కు వెళ్లకుండా ఇంట్లోనే దేశీ పద్ధతిలో ఫేషియల్ చేయించుకోవాలనుకునే మీ కోసం ఈ బ్యూటీ చిట్కాలను తీసుకొచ్చాం..

గుడ్లు, పెరుగు ఉపయోగించండి..

గుడ్డు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.. అలాగే ఇది చర్మానికి కూడా మేలు చేస్తుంది. గుడ్డు మన చర్మం నుంచి అదనపు నూనె ప్రభావాన్ని తగ్గిస్తుంది. పెరుగుతో పాటు గుడ్డును ఉపయోగించడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది.   ఈ దేశీ ఫేషియల్‌ను సిద్ధం చేయడానికి .. మీరు ఒక చెంచా పెరుగు తీసుకునిజజ అందులో ఒక గుడ్డులోని తెల్లసొన కలపాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసి ముఖంపై నెమ్మదిగా మసాజ్ చేయండి. ఇప్పుడు అది ఆరిపోయే వరకు వేచి ఉండండి. చివరకు చల్లటి నీటితో శుభ్రం చేయండి.

గుడ్డు లేకుండా పెరుగుతో..

మీ ముఖం మెరిసిపోవాలంటే పెరుగును క్లెన్సర్‌గా చేసుకోండి. దీని కోసం, మీ ముఖాన్ని తడిపి, దానిపై పెరుగును అప్లై చేసి తేలికపాటి చేతులతో మసాజ్ చేయండి. ఇప్పుడు టిష్యూ పేపర్ సాయంతో ముఖాన్ని శుభ్రం చేసి ఆరిపోయిన   తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది క్లెన్సర్‌లా పనిచేసి ముఖానికి తాజాదనాన్ని తెస్తుంది.

పిగ్మెంటేషన్ వదిలించుకోవటం ఎలా?

మొటిమలు, పిగ్మెంటేషన్ కారణంగా ముఖం చాలా చెడ్డగా కనిపిస్తుంది. మీకు కూడా అలాంటి సమస్య ఉంటే.. మీరు అరటి, పెరుగు సహాయంతో ఫేస్ మాస్క్‌ను సిద్ధం చేసుకోవచ్చు. దీని కోసం అరటిపండు తొక్క తీసి గిన్నెలో వేసి మెత్తగా చేయాలి. ఇప్పుడు అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల పెరుగు కలపాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. చివరగా గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి అంతే.

ఇలాంటి చిన్న చిన్న ఫేస్ మాస్క్ చిట్కాలతో మీరు కూడా ఇంట్లోనే అందంగా రెడీ కావచ్చు. ఇలా చేయడం వల్ల మీకు డబ్బులు కూడా ఆదా అవుతాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..