Padmasana Pose : అందరికీ తెలిసిన ఆసనం పద్మాసనం.. ఈ ఆసనం యొక్క ఉపయోగాలు ఏమిటో తెలుసా..!

భారత దేశం ప్రపంచ దేశాలకు ఇచ్చిన దివ్య వ్యాయామం యోగ.. అయితే యోగాసనాల్లో మనకు తెలియనివి ఎన్నో ఉన్నాయి. అయితే ఎక్కువ మందికి చేరువైంది.. బాగా తెలిసిన ఆసనం ఒకటి ఉంది. అదే పద్మాసనం...

Padmasana Pose : అందరికీ తెలిసిన ఆసనం పద్మాసనం.. ఈ ఆసనం యొక్క ఉపయోగాలు ఏమిటో తెలుసా..!

Updated on: Mar 10, 2021 | 11:44 AM

Padmasana Pose : భారత దేశం ప్రపంచ దేశాలకు ఇచ్చిన దివ్య వ్యాయామం యోగ.. అయితే యోగాసనాల్లో మనకు తెలియనివి ఎన్నో ఉన్నాయి. అయితే ఎక్కువ మందికి చేరువైంది.. బాగా తెలిసిన ఆసనం ఒకటి ఉంది. అదే పద్మాసనం. రెండు రేకులుగల పద్మాన్ని పోలి ఉండటం వల్ల దీనికి పద్మాసనమని పేరువచ్చింది. అయితే పద్మాసనము వేయలేనివారు, అర్ధ పద్మాసనం వేసుకోవచ్చు. ఈ ఆసనం ఎలా వేయాలి.. దానివలన ఉపయోగాలు ఏమిటి..? ఈరోజు తెలుసుకుందాం..!

పద్మాసనం వేయు పద్దతి :

మొదట రెండు కాళ్ళు చాపి నేలపై ఉంచాలి. తరువాత ఎడమ కాలును కుడి తొడపై, కుడి కాలును ఎడమ తొడపై ఉంచాలి. రెండు చేతులను మోకాళ్ళపై నిటారుగా ఉంచాలి. చూపుడు వేలును బొటన వేలుకి నడుమ ఆనించి మిగతా మూడు వేళ్ళను ముందుకు చాపి ఉంచి చిన్ముద్ర ధ్యాన స్థితికి చేరుకోవాలి. ఆ ఆసనం వేస్తున్న సమయంలో భ్రూమధ్య దృష్టిగాని, నాసాగ్ర దృష్టి గాని ఉండాలి.
ధ్యానంలో ఉన్నప్పుడు హృదయస్థానంలో మనస్సును ఏకాగ్రం చేస్తే అద్భుత ఫలితాన్ని ఇస్తుంది.

పద్మాసనం ఉపయోగాలు :

పద్మాసనము ఎక్కువగా ప్రాణాయామం, ధ్యానం చేయుటకు ఉపగయోగపడుతుంది. అంతేకాదు కుండలినీ శక్తిని జాగృతము చేసి పైకిలేపడానికి ఈ ఆసనం అత్యుత్తమం. ఇక తొడ భాగంలోని అనవసరమైన కొవ్వును ఈ ఆసనం కరిగిస్తుంది. వెన్నెముఖానికి బలం చేకూరుస్తుంది. అంతేకాదు శ్వాస సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. మానసిక శాంతి చేకూరుతుంది. ఏకాగ్రత లభిస్తుంది. ఆయుః ప్రమాణము పెరుగుతుంది.

గమనిక : ఒకొక్కసారి ఈ ఆసనం వేయుసమయంలో చీలమండకు గాయం అయ్యే అవకాశం తో పాటు మోకాళ్ల నొప్పులు వచ్చేందుకు ఆస్కారం ఉంది కనుక జాగ్రత్తలు తీసుకోవాలి.. లేదా మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు అర్ధ పద్మాసనం వేయడానికి ప్రిపరేన్స్ ఇవ్వాల్సి ఉంటుంది.

Also Read:

ప్రతి ఏడాది మార్చి రెండో బుధవారం నో స్మోకింగ్ డే.. ఈరోజు ఎందుకు జరుపుకుంటామంటే..!

మున్సిపల్ ఎన్నికల్లో పోటెత్తిన ఓటర్లు.. ఉదయం 9 గంటల వరకు 13.23 శాతం పోలింగ్