
లిప్ స్క్రబ్ ఉపయోగించండి: పొడి పెదవులపై స్క్రబ్‌ను సున్నితంగా మసాజ్ చేయాలి. దీని తర్వాత పెదాలను కడిగి లిప్ బామ్ రాసుకోవాలి. పెదవుల చర్మం సున్నితంగా ఉంటుంది. కావున దానిపై గట్టిగా రుద్దకూడదు. లిప్ స్క్రబ్‌లను వారానికి ఒకటి లేదా రెండు సార్లు కంటే ఎక్కువ ఉపయోగించవద్దు. దీంతోపాటు ఫేస్, బాడీ స్క్రబ్‌లను కూడా పెదాలపై ఉపయోగించకూడదు. ఎందుకంటే ఇవి చాలా కఠినంగా ఉండి.. సమస్యలకు దారితీస్తాయి.

లిప్ మసాజ్: మసాజ్ వల్ల పెదవుల్లో రక్త ప్రసరణ పెరుగుతుంది. దీని కారణంగా పెదాల రంగు గులాబీ రంగులోకి మారుతుంది. ప్రతిరోజూ.. ఒకసారి కొబ్బరి నూనెతో పెదాలను మసాజ్ చేస్తే మంచిది. లేకపోతే రాత్రి వేళ పడుకునే ముందు పెదాలపై నూనె రాస్తే ఉదయాన్నే మృదువుగా మారుతాయి.

లిప్ మాస్క్: కొబ్బరి నూనెలో కొంచెం పసుపు పొడిని కలపాలి. ఆ తర్వాత పేస్ట్ ను పెదవులపై అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత పెదాలను కడిగితే.. మృదువుగా మారి తళతళలాడుతాయి.

లిప్ బామ్: మీ పెదాలపై చర్మం ఎల్లప్పుడూ తేమగా ఉండాలంటే.. లిప్ బామ్‌ను అప్లై చేసుకోవచ్చు. దీనివల్ల పెదాలు మృదువుగా మారడంతోపాటు.. ఎల్లప్పుడూ హైడ్రేట్ గా ఉంటాయి.