DIY Tips: అందమైన కురుల కోసం ఇంట్లోనే హెయిర్ స్పా చేయండి.. ఖర్చు లేకుండానే మంచి ఫలితాలు..

|

Oct 18, 2022 | 8:31 PM

స్పా చికిత్స ద్వారా జుట్టు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మెరుస్తూ, మృదువుగా కనిపిస్తాయి. దీని కోసం మీరు పార్లర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. కొన్ని ప్రత్యేక చిట్కాలతో ఇంట్లోనే స్పా చేసుకోవచ్చు

DIY Tips: అందమైన కురుల కోసం ఇంట్లోనే హెయిర్ స్పా చేయండి.. ఖర్చు లేకుండానే మంచి ఫలితాలు..
Hair Spa
Follow us on

హెయిర్ స్పా జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే హెయిర్ స్పా తీసుకోవడానికి ప్రతిసారీ పార్లర్‌కు వెళ్లడం కుదరదు. దీనికి మంచి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మరోవైపు గంటల కొద్దీ సమయం వెచ్చించాల్సి వస్తోంది. మీరు కావాలంటే ఇంట్లోనే కొన్ని ప్రత్యేక మార్గాల్లో హెయిర్ స్పా ట్రీట్‌మెంట్ తీసుకోవచ్చు. ఇది మీ జేబుపై పెద్దగా ప్రభావం చూపదు. ఖర్చు లేకుండానే జుట్టు మెరుస్తూ-మృదువుగా మారుతుంది.

కొబ్బరి పాలతో స్పా..

మీరు ఇంట్లో హెయిర్ స్పా కోసం కొబ్బరి పాలను ఉపయోగించవచ్చు. ఇందుకోసం మీ జుట్టు పొడవును బట్టి తాజా కొబ్బరి పాలను తీసుకుని.. దానితో మీ జుట్టుకు మసాజ్ చేయండి. ఇప్పుడు టవల్ తీసుకుని తలకు కట్టుకుని అరగంట అలాగే ఉంచాలి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో జుట్టును కడగాలి. దీంతో జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా మారుతుంది.

గుడ్డు కరుకుదనం నుంచి విముక్తి..

గుడ్డు చాలా మంచి హెయిర్ ప్యాక్ అని చెప్పవచ్చు. దీన్ని స్పా ట్రీట్‌మెంట్‌గా ఉపయోగించడానికి కొన్ని కారణాలున్నాయి. ఎందుకంటే మీ జుట్టు పొడవును బట్టి గుడ్లు తీసుకుని అందులో ఆలివ్ ఆయిల్, తేనె కలపండి. బ్రష్ సహాయంతో దీన్ని అప్లై చేయండి. 20 నుంచి 25 నిమిషాలు అప్లై చేసి..  ఆపై షాంపూ చేయండి.

గ్రీన్ టీ

గ్రీన్ టీలో మంచి మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కాబట్టి ఇది జుట్టుకు చాలా మంచిది. హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటే ఈ మాస్క్ ఉపయోగించండి. ఇందుకోసం రెండు స్పూన్లు లేదా రెండు బ్యాగుల గ్రీన్ టీని వేడి నీటిలో వేసి మూతపెట్టి పది నిమిషాల పాటు అలాగే ఉంచాలి. నీరు చల్లారిన తర్వాత దానితో తలకు మసాజ్ చేసి అరగంట పాటు అలాగే ఉంచాలి. ఇప్పుడు సాధారణ నీటితో తల కడగండి.

ఈ మాస్క్ చేయడానికి, రెండు చెంచాల కండీషనర్ తీసుకుని, ఒక చెంచా ఆలివ్ ఆయిల్, ఒక చెంచా గ్లిజరిన్ వేసి, మూడింట ఒక వంతు వెనిగర్ వేసి కలపాలి. ఈ మాస్క్‌ని జుట్టు, మూలాలపై అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి కడిగేయండి. ఇది పొడి, చీలిపోయిన జుట్టును నయం చేస్తుంది.

అరటిపండు, ఆలివ్ నూనె అరటిపండు, ఆలివ్ నూనెతో మాస్క్ చేయడానికి ఒక అరటిపండును మిక్సీలో తీసుకుని.. ఒక చెంచా ఆలివ్ ఆయిల్, రెండు చెంచాల పెరుగు కలపండి. దీని తర్వాత రెండు మూడు చుక్కల లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ వేసి కలపాలి. దీన్ని జుట్టుకు పట్టించి ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత కడిగేయాలి. ఇది మీ జుట్టును సిల్కీ స్మూత్‌గా మార్చుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఫ్యాషన్ న్యూస్  కోసం