ఈ కాలంలో కాటన్, ఖద్దర్, పలచగా ఉండి శరీరానికి గాలి తగిలే దుస్తులను వాడాలి. ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలి.
కాటన్ దుస్తులు ఉష్ణోగ్రతను నియంత్రించి గాలిని ఇస్తూ శరీరాన్ని సమతుల్య స్థితిలో ఉంచుతాయి. చెమటలు పట్టకుండా చేస్తాయి. తద్వారా పిల్లలు ఆరోగ్యంగా ఉండటానికి దోహదపడతాయి.
ఎండాకాలం స్పెషల్ ఫ్యాబ్రిక్ కాటన్. ఇది తెలియని వారు బహుశా లేరని చెప్పాలి. కాటన్ చెమటను పీల్చుకుని, శరీరానికి గాలి తగిలేలా చేస్తుంది. కంఫర్ట్‌గా ఉంటుంది. సౌకర్యం దృష్ట్యా, ఫ్యాషన్ దృష్ట్యా ఈ కాటన్ సమ్మర్‌లో అవసరం. అవి కూడా కాస్త లూజ్‌గా, మనకు సూటయ్యే విధంగా ఎంపిక చేసుకుంటే సౌకర్యంగానూ ఉంటుంది.
ప్రస్తుతం మార్కెట్‌లో కాటన్ దుస్తుల సందడి నెలకొంది. సమ్మర్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు కాటన్‌కు సంబంధించిన రకరకాల వస్త్రాలను అమ్ముతున్నారు. చీరల దగ్గర నుంచి నైటీలు, కాటన్‌షర్టులు, చిన్నపిల్లల దుస్తులు, బాబ్‌సూట్స్ వంటివి విక్రయిస్తున్నారు.
సాధారణంగా వేసవి అనగానే కాటన్ దుస్తులే అందరూ వాడుతుంటారు. ఇవి ఒంటికి చెమటను పీల్చి, చల్లదనాన్ని అందిస్తాయి. అయితే ప్యూర్ కాటన్ వస్త్రాలు మాత్రమే వాడటం మంచిది. కాటన్ మిక్చర్ వాడటం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. కాస్త ఖరీదెక్కువైనా కాటన్ దుస్తులు ఒక్కటి రెండు జతలు ఈ వేసవికి కొనుక్కుంటే మంచిది.