Bitter Gourd- Beauty Tips: కూరగాయల్లో ఒకటి కాకరకాయ.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి చాలా మంది దీనిని తినడానికి ఇష్టపడరు.. ఎందుకంటే చేదుగా ఉంటుందని వికారంగా ముఖం పెడతారు.. అయితే ఆరోగ్యానికి మేలు చేసే కాకరకాయలో ఎన్నో అందానికి పనికి వచ్చే గుణాలు కూడా ఉన్నాయట. కాకరకాయని ఫేస్ ప్యాక్ లా వేసుకుని.. ముఖం ఎంతో అందంగా మార్చుకోవచ్చు. ఈరోజు కారకాయ తో ఫేస్ ప్యాక్స్ ఎలా చేసుకోవాలి.. ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
మొటిమలు సమస్యతో బాధపడేవారు కారకాయ రసాన్ని ముఖానికి రాసుకుని.. ఐదు నిమిషాల తర్వాత చల్లటి నీతితో శుభ్రంగా కడుగుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తే.. ముఖంపై మొటిమలు , మచ్చలు తగ్గడమే కాదు.. కాంతివంతంగా మారుతుంది కూడా..
ముఖంపై మచ్చలు ఎక్కువగా ఉంటె కాకరకాయ, కరివేపాకు మిశ్రమాన్ని మంచి ఫలితం ఇస్తుంది. కాకరకాయని పేస్ట్ లా చేసుకుని అందుకో కరివేపాకు మిశ్రం కలిపి దీన్ని ముఖానికి ప్యాక్‌లా వేయాలి. ఆరిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. మచ్చలు , మొటిమలు సమస్య చాలా వరకూ తగ్గుతుంది.
ముఖం ప్రెష్ గా ఉండడానికి కాకరకాయ నీరు అద్భుతంగా పనిచేస్తుంది. ముందుగా కాకర ముక్కలను నీటిలో మరిగించాలి. ఆ నీటిలో కాటన్ బాల్ ముంచి ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.. ఇలా చేయడం వలన ముఖం ప్రెష్ గా ఉండడమే కాదు.. మచ్చలు కూడా తగ్గుతాయి. కాకరకాయ నీరు ముఖానికి మంచి టోనర్‌గా ఉపయోగపడుతుంది.
ముఖం కాంతివంతంగా మారడానికి కాకరకాయ, జాజికాయ, పెరుగు ఫేస్ ప్యాక్ పనిచేస్తుంది. కాకరకాయ సగం ముక్కని తీసుకుని పేస్ట్‌లా చేయాలి. ఇందులో జాజికాయ పొడి, పెరుగు కలిపాలి. ఆ మిశ్రమాన్ని ముఖంపై ప్యాక్‌లా వేయాలి.కొద్దీ సేపటి తర్వాత చల్లని నీటితో ముఖాన్ని కడగాలి. ఇలా కొన్ని రోజులు చేస్తే అద్భుత ఫలితం దక్కుతుంది.
ఎన్ని ఖరీదైన క్రీములు రాసినా చర్మ సమస్యలు, దురద సమస్యలు తగ్గకపోతే కాకరకాయ, అలోవెరా పేస్ట్ లో కొంచెం పసుపు కలిసి ఈ మిశ్రమాన్ని రాస్తే .. ఉపశమనం కలుగుతుంది.
Also Read: Actress Savitri: తెలుగులోనే కాదు హాలీవుడ్ సినిమాల్లో నటించిన మహానటి సావిత్రి వారసుడు.. ఎవరో తెలుసా