Side Effects of Toothpaste:ఉదయం నిద్ర లేవగానే ఒకప్పుడు మన పెద్దవారు వేపపుల్ల తో పళ్ళను తోముకునే వారు. కాలక్రమంలో అనేక మార్పులు వచ్చాయి. అందుకో ఒకటి వేప పుల్ల స్థానంలో టూత్ పేస్ట్ ఆక్రమించింది. దీనితో నిద్ర లేవగానే మనం పళ్ళు తోముకోవడానికి టూత్ పేస్ట్ వైపు చూస్తాం.. ప్రస్తుతం మార్కెట్ లో మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా.. లవంగం ఉందా.. అంటూ రకరకాల టూత్ పేస్టులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవి అనేక అనా వలన మనకు చాల రోగాలను తెస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు పేస్ట్ ఎందుకు వాడవద్దు అంటున్నారు.. పళ్ళను శుభ్రం చేసుకోవడానికి ఏది బెస్ట్ చూద్దాం..!
మనం రోజు పళ్ళను తోముకోవడానికి వాడే టూత్ పేస్ట్ లో ఉండే రసాయనాలు చిగుర్లలోకి వెళ్లి, రక్తంలో కలసి అనారోగ్యాన్ని కలిగిస్తాయి. ఇక టూత్ పేస్టులో పాలిథిన్ ఉంటుంది. ఇది విషంతో సమానం. దీని వలన బ్రెయిన్, హార్ట్ ,కిడ్నీ దెబ్బ తింటాయి.
ఇక టూత్ పేస్టులో మనకు తీపిగా ఉండేందుకు అస్పర్టేమ్ అనే పదార్థం కలుపుతారు. దీని వలన లుకేమియా, లింఫోమా,బ్రెయిన్ ట్యూమర్ వంటి వ్యాధులు వస్తాయి.ఇది శరీరంలోకి ప్రవేశించగానే తలనొప్పి, చూపు మందగించడం,పార్కిన్ సన్స్ డిసీజ్ వచ్చే అవకాశం ఉందని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
అంతేకాదు టూత్ పేస్ట్ తోముకుంటే నురగ రావడానికి డైతానోలమైన్ అనే కెమికల్ ని వాడుతారు. ఇది లివర్ , కిడ్నీ లపై ప్రభావం చూపిస్తుందని.. క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. టూత్ పేస్టులో ఉండే సార్బిటాల్ అనే కెమికల్ విరోచనాలు. అజీర్ణం, గ్యాస్, సంబంధిత వ్యాధుల కారకంగా మారుతుంది. ఇక దీనిలో ఉండే ట్రిక్లోసన్ అనే కెమికల్ .. గుండె, క్యాన్సర్, థైరాయిడ్ వంటి సమస్యలకు కారకరంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు.
అందుకనే టూత్ పేస్ట్ కు బదులు వేప పుల్లతో పళ్ళు తోముకోవడం అత్యంత ఉత్తమం అని అంటున్నారు.
Also Read: ఒకప్పుడు ఐదు రూపాయల కోసం చెత్త ఏరుకున్న మహిళ.. నేడు కోట్ల రూపాయల టర్నోవర్‌తో బిజినెస్
లడఖ్ లోయ.. ప్రకృతి ప్రేమికులకు స్వర్గం.. ఆప్రికాట్ ఫెస్టివల్ కు సర్వం సిద్ధం..