Eye Care Tips: రోజు రోజుకి కంటి చూపు తగ్గుతోందా.. ఉదయమే ఇలా చేసి చూడండి.. కళ్ళ అద్దాలకు గుడ్ బై చెప్పేస్తారు..

ప్రస్తుతం అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, డిజిటల్‌లో ఎక్కువ సమయం గడపడం వల్ల కంటి చూపుపై తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. అందుకే గత కొన్నేళ్లుగా వయసుతో సంబంధం లేకుండా కళ్ళఅద్దాలు ధరించేవారు ఎక్కువ అవుతున్నారు. అటువంటి పరిస్థితిలో ఎవరి కళ్ళను వారే తగినంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజు ఉదయం నిద్రలేచిన తర్వాత కొన్ని పనులు చేస్తే అవి మీ కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడతాయి. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

Eye Care Tips: రోజు రోజుకి కంటి చూపు తగ్గుతోందా.. ఉదయమే ఇలా చేసి చూడండి.. కళ్ళ అద్దాలకు గుడ్ బై చెప్పేస్తారు..
Eye Care Tips

Updated on: May 09, 2025 | 3:29 PM

నేటి డిజిటల్ యుగంలో మన కళ్ళు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. రోజంతా స్క్రీన్ ముందు గడపడం వల్ల కంటి చూపు తగ్గుతుంది. అదే సమయంలో అనారోగ్యకరమైన ఆహారం, బిజీ జీవనశైలి, కాలుష్యం కూడా కళ్ళ సమస్యకు ప్రధాన కారణంగా మారుతున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకమైన కంటి సమస్యను ఎదుర్కొంటున్నారు. దీని కారణంగా వారు అద్దాలు ధరించాల్సి వస్తోంది. కొంతమంది కేవలం అద్దాలు ధరిస్తే సరిపోతుందని అనుకుంటారు.

కానీ అది సరి కాదు. అద్దాలు ధరించడంతో పాటు కళ్ళను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. కళ్ళకు సరిగ్గా చికిత్సతీసుకుంటే కంటి చూపు మెరుగుపడుతుంది. ఈ రోజు దృష్టిని మెరుగుపరచుకోవడానికి ఉదయం నిద్రలేచిన వెంటనే చేయవలసిన పనుల గురించి తెలుసుకుందాం. వీటిని చేయడం వలన దృష్టిలో తేడా కనిపిస్తుంది. చూపు పెరిగే అవకాశం ఉంది. ఉదయం నిద్రలేవగానే మీ కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే చేయవలసిన 5 పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

కళ్ళను చల్లటి నీటితో కడుక్కోండి: ఉదయం నిద్రలేచిన వెంటనే ముందుగా ముఖం కడుక్కోకుండా చల్లటి నీటితో కళ్ళను బాగా కడుక్కోండి. ఇలా చేయడం వలన కళ్ళ వాపు తగ్గుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. కళ్ళను తాజాగా ఉంచుతుంది. ఇలా చేయడం వలన కళ్ళు పొడి బారవు.

ఇవి కూడా చదవండి

సూర్యోదయ సమయంలో: సూర్యోదయం సమయంలో.. అంటే లేలేత సూర్య కిరణాలను కొన్ని సెకన్ల పాటు చూడటం వల్ల కంటి కండరాలు బలపడతాయి. ఈ ప్రక్రియ పూర్తిగా సూర్యోదయానికి 10-15 నిమిషాల ముందు మాత్రమే చేయాలని గుర్తుంచుకోండి.

త్రాటక సాధన: కంటి చూపును మెరుగుపరచుకునేందుకు త్రాటక సాధన కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. త్రాటక సాధనలో ఒకే బిందువు అంటే కొవ్వొత్తి జ్వాల, నల్ల చుక్క, లేదా ఏదైనా చిహ్నం వైపు చూస్తూ, దానిపై దృష్టిని కేంద్రీకరించడం.. ఇలా రెప్పవేయకుండా చూడడం వలన కంటి ఏకాగ్రతను పెంచుతుంది. కంటి కండరాలను బలోపేతం చేయడంలో పాటు దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

కళ్ళకు యోగా, వ్యాయామాలు: ఉదయం నిద్రలేవగానే కొన్ని కంటి వ్యాయామాలు, యోగా చేయడం ద్వారా కంటి చూపును కూడా మెరుగుపరచవచ్చు. కళ్ళను పైకి-క్రిందికి, కుడి-ఎడమకు కదిలించడం, రెప్పవేయడం వంటివి కంటి కండరాలను ఉత్తేజపరుస్తాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి.

బాదం, పటిక బెల్లం, సోంపు తీసుకోవడం: ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని పాలతో ఒక టీస్పూన్ బాదం, పటిక బెల్లం, సోంపు పొడిని కలిపి తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ఈ మిశ్రమాన్ని ఆయుర్వేదంలో కళ్ళకు చాలా ప్రయోజనకరంగా భావిస్తారు. మీరు దీన్ని మీ ఆహారంలో భాగంగా కూడా చేర్చుకోవచ్చు.

 

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Loading...
Unable to load recommendations.
Follow Us