Health: ఎక్కువ నురగ వచ్చే షాంపూ వాడుతున్నారా.. అయితే మీకు ఈ సమస్యలు తప్పవు

|

Jul 30, 2022 | 3:53 PM

ప్రస్తుత కాలంలో జుట్టురాలిపోయే సమస్య యువకులను తీవ్ర వేదనకు గురి చేస్తోంది. పాతికేళ్లు రాకముందే జుట్టు ఊడిపోతుండటం, రంగు మారిపోవడం వంటి సమస్యలు అధికమవుతున్నాయి. ఫలితంగా కుంగుబాటు, యాంగ్జైటీ సమస్యలకు గురై శారీరకంగా,..

Health: ఎక్కువ నురగ వచ్చే షాంపూ వాడుతున్నారా.. అయితే మీకు ఈ సమస్యలు తప్పవు
Hair Wash Shampoo
Follow us on

ప్రస్తుత కాలంలో జుట్టురాలిపోయే సమస్య యువకులను తీవ్ర వేదనకు గురి చేస్తోంది. పాతికేళ్లు రాకముందే జుట్టు ఊడిపోతుండటం, రంగు మారిపోవడం వంటి సమస్యలు అధికమవుతున్నాయి. ఫలితంగా కుంగుబాటు, యాంగ్జైటీ సమస్యలకు గురై శారీరకంగా, మానసికంగా చెప్పుకోలేని సమస్యలతో సతమతమవుతున్నారు. లైఫ్ స్టైల్ లో మార్పులు, వేళకు భోజనం చేయకపోవడం, అర్థరాత్రి వరకు మెలకువగా ఉండటం, మానసిక ఒత్తిడి వంటి కారణాలు జుట్టు రాలిపోయేందుకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో పాతికేళ్లకే బట్టతల వచ్చేస్తోంది. సాధారణంగా జుట్టు పెరిగే దశ, విశ్రాంతి దశ, రాలిపోయే దశ అని మూడు దశలు ఉంటాయి. సాధారణంగా ఆడవారికైనా, మగవారికైనా రోజుకు వంద వెంట్రుకల వరకు రాలిపోతుంటాయి. వాటి స్థానంలో కొత్తవి వస్తుంటాయి. ఇలా వెంట్రుకలు రాలిపోకుండా ఉంటే వాటిని పెంచడం కష్టంగా ఉంటుంది. కానీ అదే పనిగా వెంట్రుకలు ఊడిపోతే అశ్రద్ధ చేయకుండా వైద్యులను కలవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బీ 12 విటమిన్, ఐరన్‌ లోపం, జన్యు సంబంధిత సమస్యల వల్ల బట్ట తలవస్తుంది. ఒక వేళ తండ్రికి బట్టతల ఉంటే వారి సంతానానికి వచ్చే అవకాశం 78 శాతం ఉంటుంది. మిగిలిన 22 శాతం తాత, ముత్తాతల నుంచి వచ్చే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. జుట్టుకు రంగులు వేయడం, వీవింగ్‌ చేయించడంతో పాటు కరోనా టీకా కారణంగా కూడా జుట్టు రాలిపోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. వయసు ఆధారంగా వచ్చే బట్టతలను ఆపలేం. మందులు, ఆయిల్స్‌ వాడినా ఎలాంటి ప్రయోజనం ఉండదు.

వీటితో పాటు నివాస ప్రాంతాలు మారినప్పుడు కూడా అక్కడి వాటర్ పడకపోవడం వల్ల జుట్టు రాలిపోతుంది. జుట్టు రాలకుండా ఉండే మందులను వైద్యుల సూచన మేరకే వాడుకోవాలి. డైట్ లో మార్పులు చేసుకోవడం, ఆరోగ్యకరమైన జీవన విధానాలను పాటించడం వల్ల ఈ సమస్యను అరికట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. బాగా నురుగు రాకుండా ఉండే షాంపూలు వాడాలి. బట్టతలతో బాధపడే వారికి హెయిర్‌ ట్రాన్స్​ప్లాంటేషన్‌ మంచి పరిష్కారం చూపిస్తుంది.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ విషయాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే..వీటిని పాటించే ముందు నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి