Eggs Vs Paneer: పనీర్ వర్సెస్ గుడ్లు.. బ్రేక్ ఫాస్ట్‌లో ఏది బెస్ట్..? అసలు విషయం తెలిస్తే అవాక్కే..

బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు, పనీర్.. ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనే చర్చ ఎప్పుడూ ఉంటుంది. రెండూ ప్రోటీన్ నిండిన ఆహారాలే. అయితే బరువు తగ్గడానికి, కండరాల పెరుగుదలకు, రోజంతా శక్తి కోసం ఈ రెండింటిలో దేనిని ఎంచుకోవాలి..? గుడ్లను ఎందుకు పూర్తి ప్రోటీన్ అంటారు? పనీర్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎలా మేలు చేస్తుంది..?

Eggs Vs Paneer: పనీర్ వర్సెస్ గుడ్లు.. బ్రేక్ ఫాస్ట్‌లో ఏది బెస్ట్..? అసలు విషయం తెలిస్తే అవాక్కే..
Eggs Vs Paneer

Updated on: Oct 01, 2025 | 6:04 PM

మీరు హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ చేయాలనుకుంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ తక్షణ శక్తితో పాటు పోషకాలు, ముఖ్యంగా ఎక్కువ ప్రోటీన్‌ కావాలంటే గుడ్లు, పనీర్ మంచి ఎంపికలు. ప్రోటీన్ అధికంగా ఉండే ఈ రెండు ఆహారాలు పోషకమైనవిగా ఉండటంతో పాటు కడుపు నిండిన అనుభూతిని ఇస్తాయి. ఇవి బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి.. కాబట్టి చాలా మంది వీటిని తినడానికి ఇష్టపడతారు. కాబట్టి ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మరింత మంచిదో ఇప్పుడు చూద్దాం.

ఉడికించిన గుడ్లు: ఎందుకంత స్పెషల్?

గుడ్లను పూర్తి ప్రోటీన్ ఆహారం అంటారు. అంటే ఇందులో మన కండరాలు పెరగడానికి కావాల్సిన తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఉదయం కనీసం రెండు గుడ్లు తింటే మీ మెదడు చురుకుగా పనిచేస్తుంది. జీవక్రియ, శక్తి స్థాయిలు మెరుగవుతాయి. గుడ్లలోని కొవ్వులు కంటికి కూడా చాలా మంచివి. ఒక పెద్ద గుడ్డులో దాదాపు 6 గ్రాముల ప్రోటీన్ దొరుకుతుంది. ప్రత్యేకంగా గుడ్డులోని తెల్లసొన తక్కువ కేలరీలతో స్వచ్ఛమైన ప్రోటీన్‌ను అందిస్తుంది. గుడ్లను ఉడికించి, ఆమ్లెట్‌గా లేదా అల్పాహారంగా చాలా విధాలుగా తినవచ్చు.

పనీర్ ఎందుకు బెటర్..?

పనీర్ అనేది అత్యుత్తమ నాణ్యత గల ప్రోటీన్ యొక్క పవర్‌హౌస్. కండరాల పెరుగుదలకు, రోజంతా స్థిరమైన శక్తికి ఇది చాలా అవసరం. పనీర్ నెమ్మదిగా జీర్ణం అవుతుంది. అందుకే తిన్న తర్వాత చాలాసేపు ఆకలి వేయదు. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇది పాలతో తయారు చేస్తారు కాబట్టి పనీర్‌లో కాల్షియం, పాస్పరస్ అధికంగా ఉంటాయి. ఇవి మీ ఎముకలు, దంతాలను గట్టిగా ఉంచుతాయి. పనీర్ ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటుంది. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచకుండా స్థిరమైన శక్తిని ఇస్తుంది. అందుకే షుగర్ ఉన్నవారు ఉదయం తినడానికి ఇది సరైన ఆహారం.

ఏది బెస్ట్..?

గుడ్లు – పనీర్ రెండూ దాదాపు ఒకే రకమైన ప్రోటీన్‌ను అందిస్తాయి. కాబట్టి ఒకదాని కంటే మరొకటి గొప్పదని చెప్పలేం. ఆరోగ్య నిపుణుల సలహా ఏంటంటే.. మీ ఆహారంలో అభిరుచి, పోషకాల వైవిధ్యాన్ని కొనసాగించడానికి.. ఒక రోజు ఉడికించిన గుడ్లు తింటే.. మరుసటి రోజు ఒక కప్పు పనీర్ తినండి. రెండింటి ప్రయోజనాలు పొందండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…