Hairfall: దువ్విన ప్రతిసారి జుట్టు రాలుతుందా.. ఈ సింపుల్‌ చిట్కాలతో ఈజీగా చెక్‌ పెట్టండి

ప్రస్తుతం మారుతున్న లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అనేక రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అందులో జుట్టు రాలడం కూడా ఒకటి. ఈ సమస్యను దూరం చేసుకునేందుకు జానాలు ఎన్నో మందులు వాడుతున్నారు. కానీ ఎలాంటి లాభం లేకుండా పోతుంది. కాబట్టి ఎక్కువ ఖర్చు లేకుండా ఈ సమస్యను ఎలా అదిగమించాలో ఇక్కడ తెలుసుకుందాం.

Hairfall: దువ్విన ప్రతిసారి జుట్టు రాలుతుందా.. ఈ సింపుల్‌ చిట్కాలతో ఈజీగా చెక్‌ పెట్టండి
Hairfall

Updated on: Oct 08, 2025 | 6:30 AM

మీ తలపై కంటే మీ దువ్వెనపై ఎక్కువ వెంట్రుకలు కనిపిస్తే , మీకు జుట్టు రాలడం సమస్య ఉందని అర్థం. జుట్టు రాలడంతో ఇబ్బంది పడుతున్న వారిలో మీరు ఒకరైతే, ఈ వార్త మీ కోసమే. ఈ రోజుల్లో జుట్టు రాలడం చాలా సాధారణమైంది. దీని కారణంగా పురుషులలో బట్టతల రేటు పెరుగుతోంది. దీనిని నివారించడానికి అనేక మందులు, చికిత్సలు ఉన్నాయి. కానీ వీటి వల్ల కొన్ని సార్లు సౌడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా కలగవచ్చు. కాబట్టి ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్ లేకుండా మన ఇంట్లో దొరికే కొన్ని వస్తువలతో ఈ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

1.ఎర్రపప్పుతో జుట్టు రాలే సమస్య చెక్..

మీ వంటగదిలో ఉండే ఎర్రపప్పుతో ఈ జుట్టురాలే సమస్యకు ఈజీ చెక్‌ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఎర్ర పప్పులో మీ జుట్టు ఆరోగ్యానికి అవసరమైన ఇనుము, ప్రోటీన్, ఇతర ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఈ పప్పు మీ జుట్టు మూలాలను బలోపేతం చేయడమే కాకుండా.. మీ జుట్టు మెరుపును పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. ఎర్ర పప్పులో జుట్టు పెరుగుదలకు అవసరమైన ఐరన్, ఫోలిక్ యాసిడ్, ప్రోటీన్, విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ జుట్టును కాపాడేందుకు సహాయ పడుతాయి.

ఇందులో ఉండే ఇనుము జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడే నెత్తికి రక్త ప్రసరణను మెరుగుపరచడానికి చాలా అవసరం. అలాగే ఈ పప్పులో ఫోలిక్ ఆమ్లం ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు సహాయపడుతుంది, ఇది మీ జుట్టు కుదుళ్లకు తగినంత ఆక్సిజన్‌ను అందిస్తుంది. ఇక వీటిలో ఉండే ప్రోటీన్ జుట్టును బలోపేతం చేయడానికి, జుట్టు తెగిపోకుండా నిరోధించడానికి సహాయపడుతుంది.

2. మెంతులు, కరివేపాకు

మన వంటిట్లో లభించే మెంతులు, కరివేపాకులతో కూడా జుట్టు రాలే సమస్యకు చెక్‌ పెట్టవచ్చు. ఇందు కోసం మీరు ఈ రెండింటి మిశ్రమాన్ని పేస్ట్‌లా చేసి జుట్టుకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మిశ్రమాన్ని ఎలా తయారు చేయాలంటే.. మొదటగా 3 టీస్పూన్ల మెంతులు, ఒక గుప్పెడు కరివేపాకు తీసుకోండి. తర్వాత 2 కప్పుల నీరు సగం కప్పు అయ్యే వరకు తక్కువ వేడి మీద మరిగించండి. తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సర్‌లో వేసి పేస్ట్ లా చేయండి. షాంపూ వాడటానికి గంట ముందు ఈ పేస్ట్‌ను మీ తలకు, జుట్టుకు అప్లై చేయండి. తర్వాత మీరు దానిని సాధారణ నీటితో కడుక్కోవచ్చు. ఇది దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇస్తుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. వీటిపై మీకు ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us