
అయితే ఇలా లొట్టలేసుకొని తినే పానీ పూరితో అనేక అనారోగ్య సమస్యలు దరి చేరే అవకాశం ఉంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే చాలా వరకు గల్లీల్లో ఉండే పానీ పూరీ బండ్ల వద్ద శుభ్రత అనేదే ఉండదు. ఒక వైపు చెత్తచెదారం. మరో వైపు వాహనాల నుంచి వచ్చు దుమ్ము ధూళఇ, ఇదంతా పక్కన పెడితే పానీ పూరీ వేసే వ్యక్తి చేతులు శుభ్రం చేసుకోకుండా అందరికీ ఒకే చేతితో పెట్టడం.

ఇంక కొంతమంది అయితే పానీపూరీలను నీటిలో ముంచేటప్పుడు చేతి వేళ్ల గోర్లు కూడా తీసుకోరు. దీంతో అనేక వ్యాధులు ప్రభలే అవకాశం ఉంది. అదే విధంగా, పానీపూరీలో వేసే పచ్చిమిర్చి అల్సర్‌ను పెంచుతుంది. అలాగే మైదాపిండి, రుచి కోసం ఎక్కువ ఉప్పు వేయడం వంటివి చేస్తారు. ఇవి మన రోగ నిరోధక వ్యవస్థను దెబ్బతీస్తాయి.

ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. మరీ ముఖ్యంగా పానీ పూరీలో వాడే నీరు అక్కడి దుమ్ము, ధూళితో చాలా వరకు కలుషితం అవుతాయి. అందువలన ఇది తినడం వలన అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతాయంట.

అపరిశుభ్రమైన ప్రాంతంలో పానీ పూరి తినడం వలన టైఫాయిడ్, మూత్ర పిండాల వ్యాధి, క్యాన్సర్, దగ్గు జలుబు లాంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది అం టున్నారు ఆరోగ్య నిపుణులు.

అందువల్లనే వీలైనంత వరకు పానీ పూరికి చాలా దూరంగా ఉండాలంట. లేదా ఇంట్లోనే తయారు చేసుకొని తినడం ఉత్తమం అంటున్నారు వైద్యులు.