వైట్‌ రైస్‌కి బదులుగా ఓట్స్‌ తింటున్నారా..? ఏమౌతుందో తెలుసుకోవడం తప్పనిసరి..!

బరువు తగ్గడంలో ఓట్స్‌ ఎక్కువగా సహాయపడతాయని నిపుణులు చెబుతున్నప్పటికీ..ఇవి ఎక్కువగా తీసుకుంటే మాత్రం వ్యతిరేక పరిణామాలు చూపిస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఓట్స్‌లో ఫైటిక్‌ యాసిడ్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కాల్షియం, జింక్‌ వంటి ఖనిజాల శోషణను నిరోధిస్తుంది.చాలా కంపెనీలు ఇచ్చే ఓట్స్ ప్రాసెస్డ్ అయి ఉండటం వల్ల అందులో పోషకాలు తగ్గిపోతాయి.ఓట్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి కలిగే నష్టాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

వైట్‌ రైస్‌కి బదులుగా ఓట్స్‌ తింటున్నారా..? ఏమౌతుందో తెలుసుకోవడం తప్పనిసరి..!
Oats

Updated on: Apr 07, 2025 | 10:52 AM

ప్రస్తుతం ఎక్కువ మంది బరువు తగ్గించుకునేందుకు గానూ, వైట్‌ రైస్‌ కి బదులుగా వివిధ రకాలైన డైట్‌ఫుడ్‌ తీసుకోవటం అలవాటు చేసుకుంటున్నారు. అలాంటి డైట్‌లో ముఖ్యంగా ఓట్స్‌ ఒకటి. బరువు తగ్గడంలో ఓట్స్‌ ఎక్కువగా సహాయపడతాయని నిపుణులు చెబుతున్నప్పటికీ..ఇవి ఎక్కువగా తీసుకుంటే మాత్రం వ్యతిరేక పరిణామాలు చూపిస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఓట్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి కలిగే నష్టాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఓట్స్‌ ఎక్కువగా తీసుకోవటం వల్ల వాయువు, గ్యాస్‌ వంటి జీర్ణ సంబంధ సమస్యలు రావచ్చు. ఓట్స్‌లో ఉండే ఫైటేట్స్ వల్ల శరీరానికి అవసరమైన న్యూట్రియెంట్స్ అందకపోవచ్చు. బరువు తగ్గడానికి ఓట్స్ మంచిదనుకుంటారు.. కానీ తగ్గిన క్యాలరీల కారణంగా శరీరానికి అవసరమైన శక్తి అందకపోవచ్చు. ఓట్స్ తిన్న.. తక్కువ సమయంలోనే మళ్లీ ఆకలి అనిపించేలా చేసి, అధికంగా తినిపించవచ్చు. ప్రతి ఒక్కరి శరీరానికి ఓట్స్ సరిపోకపోవచ్చు. విషేషంగా అలెర్జీ ఉన్నవారికి దూరంగా ఉండడం ఉత్తమం.

ప్రతిరోజూ ఎక్కువగా ఓట్స్‌ తీసుకుంటే పెద్ద మొత్తంలో బరువు పెరిగే అవకాశాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. చాలా కంపెనీలు ఇచ్చే ఓట్స్ ప్రాసెస్డ్ అయి ఉండటం వల్ల అందులో పోషకాలు తగ్గిపోతాయి, గ్లైసెమిక్ ఇండెక్స్ పెరిగి డయబెటిక్ పేషెంట్స్‌కి హాని కలిగించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఓట్స్ మంచిదే కానీ మితంగా తీసుకుంటేనే ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఓట్స్‌లో ఫైటిక్‌ యాసిడ్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కాల్షియం, జింక్‌ వంటి ఖనిజాల శోషణను నిరోధిస్తుంది. ఓట్స్‌ని నానబెట్టడం లేదా పులియబెట్టడం వల్ల వాటిలో ఫైటిక్‌ యాసిడ్‌ కంటెంట్‌ తగ్గుతుంది. ఇవి గ్లూటెన్‌ రహితంగా ఉన్నప్పటికీ..తరుచుగా గోధుమ, బార్లీ మాదిరిగా ప్రాసెస్‌ చేయబడతాయి. ఇది ఉదరకుహార వ్యాధి లేదా గ్లూటెన్‌ సెన్సిటివిటీకి దారితీస్తుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..