Foods for Jaundice : కామెర్లు రాకుండా ఉండాలంటే.. ఈ సూపర్ ఫుడ్స్ తినండి!

శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో కాలేయం కూడా ఒకటి. ఇది రక్తంలోని వ్యర్థ పదార్థాలను, ఆహారాన్ని జీర్ణం చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. కాలేయం సరిగ్గా పనిచేయకపోతే అనే అనారోగ్య సమస్యలు వస్తాయి. వాటిల్లో కామెర్లు కూడా ఒకటి. రక్త ప్రవాహంలోని ఉండే బిల్రుబిన్ కొవ్వుల్లో కరిగి పోతుంది. దీని వల్ల చర్మం, కళ్లు, చిగుళ్లు పసుపు రంగులోకి మారిపోతాయి. కామెర్ల వ్యాధి వచ్చిన వారు జీర్ణక్రియను మెరుగు పరిచే ఆహారాలను తీసుకోవాలి. అప్పుడే కాలేయం దెబ్బ తినకుండా..

Foods for Jaundice : కామెర్లు రాకుండా ఉండాలంటే.. ఈ సూపర్ ఫుడ్స్ తినండి!
Foods for Jaundice
Follow us

|

Updated on: Apr 18, 2024 | 11:44 AM

శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో కాలేయం కూడా ఒకటి. ఇది రక్తంలోని వ్యర్థ పదార్థాలను, ఆహారాన్ని జీర్ణం చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. కాలేయం సరిగ్గా పనిచేయకపోతే అనే అనారోగ్య సమస్యలు వస్తాయి. వాటిల్లో కామెర్లు కూడా ఒకటి. రక్త ప్రవాహంలోని ఉండే బిల్రుబిన్ కొవ్వుల్లో కరిగి పోతుంది. దీని వల్ల చర్మం, కళ్లు, చిగుళ్లు పసుపు రంగులోకి మారిపోతాయి. కామెర్ల వ్యాధి వచ్చిన వారు జీర్ణక్రియను మెరుగు పరిచే ఆహారాలను తీసుకోవాలి. అప్పుడే కాలేయం దెబ్బ తినకుండా ఉంటుంది. కామెర్లు రాకుండా ఉండాలంటే.. కొన్ని రకాల సూపర్ ఫుడ్స్ తీసుకోవాలి. ఎలాంటి ఆహారాలు తీసుకోకూడదో ఇప్పుడు చూద్దాం.

తృణ ధాన్యాలు:

క్వినోవా, బ్రౌన్ రైస్, ఓట్స్, గోధుమలు, మిల్లెట్స్ వంటి తృణ ధాన్యాలు తీసుకోవాలి. వీటిల్లో డైటరీ, ఫైబర్ ఫినోలిక్ ఆమ్లం అధికంగా ఉంటుంది. వీటిని తింటే.. కాలేయం ఆరోగ్యం మెరుగు పడుతుంది. దీర్ఘకాలిక వ్యాధులు, కాలేయ క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు.

లీన్ ప్రోటీన్లు:

చేపలు, పౌల్ట్రీ, చిక్కుళ్లు, టోఫు వంటి ఆహారాల్లో లీన్ ప్రోటీన్ అధికంగా లభిస్తుంది. ఇవి కామెర్లు రాకుండా అడ్డుకుంటాయి. కామెర్ల బారిన పడ్డవారు కూడా వీటిని తింటే మంచిది. పలు పరి శోధనలు చెబుతున్నా దాని ప్రకారం.. ఉప్పు, కొవ్వు ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తినకూడదు. దీని వల్ల కామెర్ల సమస్య ఎక్కువ అవుతుంది.

ఇవి కూడా చదవండి

వేయించిన ఆహారాలు:

కామెర్లు ఉన్నవారు వేయించిన ఆహారా పదార్థాలు, కొవ్వు ఉన్న ఆహారాలు అస్సలు తీసుకోకూడదు. ఇలాంటి ఆహార పదార్థాలు తింటే కాలేయం త్వరగా ఆహారాన్ని జీర్ణం చేయలేదు. అదే విధంగా ఫైబర్ ఉన్న ఆహారాలు తీసుకోవాలి.

నీటిని అధికంగా తాగాలి:

కామెర్ల సమస్య ఉన్నవారు ప్రతి రోజూ కనీసం నాలుగు లీటర్ల నీటిని తీసుకుంటూ ఉండాలి. ఇలా తాగడం వల్ల కామెర్ల సమస్య తగ్గుగుతంది. నీటిని తాగడం వల్ల కిడ్నీలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.

పండ్లు – కూరగాయలు:

అదే విధంగా తాజాగా ఉండే పండ్లుచ కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కామెర్ల సమస్యను తగ్గించవచ్చు. బెర్రీస్ జాతికి చెందిన పండ్లు, ద్రాక్ష, బొప్పాయి, దానిమ్మ తీసుకుంటే మరింత మంచిది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..