AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏసీ లేకున్నా వేసవిలో మీ ఇల్లు చల్లగా ఉండాలా? ఐతే మీ కూలర్‌ను ఇలా ACలా మార్చేయండి..

Cooler cooling technique Tips: ఏసీలు కొన్ని నిమిషాల్లోనే గది మొత్తాన్ని చల్లగా మారుస్తాయి. కానీ వాటి ధర, పెరుగుతున్న విద్యుత్ బిల్లుల కారణంగా అందరూ వాటిని ఉపయోగించడం సాధ్యం కాదు. అందువల్ల, చాలా ఇళ్లలో కూలర్ ఉపయోగిస్తుంటారు. ఇది అత్యంత చవకైన, నమ్మదగిన ఎంపిక. అయినప్పటికీ కూలర్..

ఏసీ లేకున్నా వేసవిలో మీ ఇల్లు చల్లగా ఉండాలా? ఐతే మీ కూలర్‌ను ఇలా ACలా మార్చేయండి..
Air Cooler
Srilakshmi C
|

Updated on: May 24, 2026 | 1:56 PM

Share

వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రత వేడి, తేమతో కూడిన వాతావరణం కారణంగా జనాలు ఏసీలు, కూలర్లను పెద్ద మొత్తంలో ఉపయోగిస్తున్నారు. ఏసీలు కొన్ని నిమిషాల్లోనే గది మొత్తనికి చల్లదనాన్ని అందిస్తాయి. కానీ వాటి ధర, పెరుగుతున్న విద్యుత్ బిల్లుల కారణంగా అందరూ వాటిని ఉపయోగించడం సాధ్యం కాదు. అందువల్ల, చాలా ఇళ్లలో కూలర్ ఉపయోగిస్తుంటారు. ఇది అత్యంత చవకైన, నమ్మదగిన ఎంపిక. అయినప్పటికీ కూలర్ ఆశించినంత చల్లని గాలిని అందించడం లేదని తరచుగా ఫిర్యాదులు వస్తుంటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం కొన్ని సులభమైన, చవకైన పరిష్కారాలతో సాధారణ కూలర్ కూడా మంచులాంటి చల్లని గాలిని అందిస్తుంది. సరైన ఉపయోగం, క్రమమైన నిర్వహణతో కూలర్ శీతలీకరణ సామర్థ్యం అనేక రెట్లు పెరుగుతుంది. అందుకు ఏమేం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

కూలర్ నుండి వచ్చే చల్లని గాలికి ప్రధాన కారణం దానిలోని నీటి ఉష్ణోగ్రత. ట్యాంక్‌లోని నీరు ఎంత చల్లగా ఉంటే గాలి కూడా అంత చల్లగా మారుతుంది. ఇందుకోసం కూలర్‌లోని నీటిలో ఐస్ క్యూబ్స్ వేయడం మంచిది. దీనివల్ల గది వెంటనే చల్లగా అనిపిస్తుంది. అంతేకాకుండా ఐస్‌ త్వరగా కరగకుండా, నీరు ఎక్కువ సేపు చల్లగా ఉండటానికి, నీటిలో కొద్దిగా ఉప్పు కలపడం భలేగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా చేయడం వల్ల ఐస్‌ ఎక్కువ సేపు నిలుస్తుంది. చల్లదనం నిరంతరంగా ఉంటుంది. ఈ చిట్కా ముఖ్యంగా విపరీతమైన వేడి రోజులలో ప్రభావవంతంగా పని చేస్తుంది.

కూలర్‌లోని కూలింగ్ ప్యాడ్‌లు లేదా గడ్డి దాని శీతలీకరణ పనితీరులో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల, ఈ ప్యాడ్‌లలో దుమ్ము, ధూళి పేరుకుపోతాయి. దీని కారణంగా నీరు సరిగ్గా ప్రసరించక శీతలీకరణ తగ్గుతుంది. అందువల్ల కూలర్ ప్యాడ్‌లను ఎప్పటికప్పుడు శుభ్రపరచడం చాలా ముఖ్యం.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌ స్టైల్ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us