
మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం.. ఈ విషయం అందరికీ తెలుసు.. కానీ.. ఈ ప్రపంచంలో మద్యం తాగేవారు చాలా మంది ఉన్నారు. భారతదేశంలో కూడా లక్షలాది మంది తమ అభిరుచికి తగ్గట్టుగా మద్యం తాగుతారు. కొంతమంది వివిధ రకాల ఆల్కహాల్‌లను కలిపి తాగుతారు. మరికొందరు.. ఆల్కాహాల్ తో పాటు వాటర్, సోడా, డ్రింక్స్, జ్యూస్‌లు, కొబ్బరినీరు.. ఇంకా కొన్ని డ్రింక్స్ ను కలుపుకుని తాగుతారు.. నిజానికి, మద్యం తాగే విషయంలో ప్రజలకు అనేక ప్రాధాన్యతలు ఉంటాయి.
కానీ ఈ తరహా మద్యం తాగడం వల్ల కొన్నిసార్లు శరీరంపై చెడు ప్రభావం చూపుతుంది. అదేంటంటే.. మద్యం, పాలు తాగడం.. కొందరు పాలు తాగిన వెంటనే మద్యం తాగుతారు. మరికొందరు మద్యం తాగే ముందు పాలు తాగుతారు. ఇది శరీరాన్ని ఖచ్చితంగా ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం..
పాలు తాగిన వెంటనే మద్యం, బీరు తాగడం వల్ల చాలా మంది శరీరాలపై ప్రభావం ఉండదు. అయితే, కొంతమందికి జీర్ణ సమస్యలు రావచ్చు. మద్యం – బీరు, పాలు కలిపి తాగడం వల్ల కొన్నిసార్లు ఉబ్బరం, వాంతులు వంటి సమస్యలు వస్తాయి. అందువల్ల, అలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉన్నా.. లేదా ఎప్పుడైనా బాధపడి ఉంటే.. పాలు, మద్యం కలిపి తాగకుండా ఉండండి.
పాలు తాగడం వల్ల ఆల్కహాల్ శోషణ మందగిస్తుందని కొందరు అంటున్నారు. కానీ ఇది ఆమ్లత్వం, ఉబ్బరానికి దారితీస్తుంది. కాబట్టి, సరైన జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా, ఇప్పటికే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పాలు, ఆల్కహాల్ తాగడానికి ప్రయత్నించకూడదు.
పాలు తాగిన కొన్ని గంటల తర్వాత మద్యం తాగడం వల్ల శరీరంపై ఎటువంటి ప్రతికూల ప్రభావాలు ఉండే అవకాశం తక్కువ. అందువల్ల, పాలు – ఆల్కహాల్ మధ్య దూరం ఉంచడం మంచిది.. పాలు తాగితే, తాగేటప్పుడు తక్కువ ఆల్కహాల్ కంటెంట్ ఉన్న ఆల్కహాల్‌ను ఎంచుకోండి. సోడా లేదా కార్బోనేటేడ్ పానీయాలు తాగడం మానుకోండి. అసలు ఇలా చేయడం కూడా కరెక్ట్ కాదు..
గమనిక.. మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం. మేము మద్యం సేవించడాన్ని ప్రోత్సహించడం లేదు. ఏదైనా ప్రయోగాన్ని ప్రయత్నించే ముందు దయచేసి నిపుణుడిని సంప్రదించండి..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..