AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఖరీదైన నెయిల్‌ పాలిష్‌ కొద్ది రోజులకే ఎండిపోయిందా..? ఈ సింపుల్ ట్రిక్స్‌తో మళ్ళీ కొత్తదానిలా మార్చేయండి!

ప్రతి అమ్మాయి బ్యూటీ కిట్‌లో నెయిల్ పెయింట్ ఒక ముఖ్యమైన భాగం. కానీ కొన్నిసార్లు, మీకు ఇష్టమైన, ఖరీదైన నెయిల్ పాలిష్‌ కొన్ని రోజుల్లోనే ఆరిపోయి, చిక్కగా మారడం జరుగుతుంది. అటువంటి పరిస్థితిలో, చాలా మంది దానిని పారేసి కొత్తది కొంటారు. అయితే, ప్రతిసారీ ఇలా చేయాల్సిన అవసరం లేదు. కొంచెం చాకచక్యత, సరైన చిట్కాలతో మీరు ఎండిపోయిన నెయిల్ పాలిష్‌ను మళ్లీ ఉపయోగపడేలా చేయవచ్చు. ఇది మీకు డబ్బును ఆదా చేయడమే కాకుండా, మీకు ఇష్టమైన షేడ్‌ను ఎక్కువ రోజులు ఉంచుకోవడానికి కూడా సహాయపడుతుంది. మీకు ఇష్టమైన నెయిల్ పాలిష్ ఎండిపోయిందని పారేయకండి. దీనిని తిరిగి కొత్తదానిలా మార్చడానికి కొన్ని సులభమైన గృహ చిట్కాలు ఉన్నాయి.

ఖరీదైన నెయిల్‌ పాలిష్‌ కొద్ది రోజులకే ఎండిపోయిందా..? ఈ సింపుల్ ట్రిక్స్‌తో మళ్ళీ కొత్తదానిలా మార్చేయండి!
Dried Nail Polish Fix
Jyothi Gadda
|

Updated on: May 02, 2026 | 7:09 PM

Share

మహిళలకు తమ కలెక్షన్‌లో రకరకాల నెయిల్ పాలిష్ రంగులు ఉండటం అంటే చాలా ఇష్టం. అయితే, చాలా కాలం పాటు వాడకపోవడం వల్ల లేదా మూత సరిగ్గా పెట్టకపోవడం వల్ల నెయిల్ పాలిష్ తరచుగా ఎండిపోతుంటుంది. ఇలా గడ్డకట్టినప్పుడు అది గోర్లకు పెట్టుకోవడానికి వీలు పడదు. చాలా మంది ఇది పాడైపోయిందని భావించి పారేస్తుంటారు. కానీ, కొన్ని చిన్న చిట్కాలతో దానిని మళ్ళీ సాధారణ స్థితికి తీసుకురావచ్చు. అదేలాగో ఇప్పుడు చూద్దాం..

వేడి నీటి చికిత్స (Hot Water Bath):

ఎండిపోయిన నెయిల్ పాలిష్‌ను సరిచేయడానికి ఇది అత్యంత సులభమైన పద్ధతి. ఒక గిన్నెలో వేడి నీటిని తీసుకుని, అందులో నెయిల్ పాలిష్ బాటిల్‌ను సుమారు 2 నుంచి 5 నిమిషాల పాటు ఉంచండి. నీరు మరీ మరిగేలా ఉండకూడదు. వేడి వల్ల బాటిల్ లోపల గడ్డకట్టిన నెయిల్ పెయింట్ కరిగి, మళ్ళీ ద్రవ రూపంలోకి మారుతుంది.

నెయిల్ పాలిష్ థిన్నర్ లేదా రిమూవర్:

బాటిల్‌లో కొన్ని చుక్కల నెయిల్ పాలిష్ థిన్నర్‌ను వేయండి. ఒకవేళ థిన్నర్ లేకపోతే, నెయిల్ పాలిష్ రిమూవర్‌ను కూడా వాడవచ్చు. అయితే రిమూవర్ మరీ ఎక్కువగా వేయకండి, ఎందుకంటే అది రంగును పలచబరిచే అవకాశం ఉంది. కేవలం రెండు మూడు చుక్కలు వేసి బాటిల్‌ను బాగా ఊపితే సరిపోతుంది.

ఇవి కూడా చదవండి

అరచేతులతో వేడిని పుట్టించడం:

నెయిల్ పాలిష్ బాటిల్‌ను రెండు అరచేతుల మధ్య ఉంచి వేగంగా అటు ఇటు దొర్లించండి (Roll చేయండి). ఇలా రుద్ధడం వల్ల కలిగే ఘర్షణ వల్ల వేడి పుట్టి, లోపల ఉన్న రంగు మృదువుగా మారుతుంది. బాటిల్‌ను పైకి కిందకు గట్టిగా ఊపడం కంటే ఇలా దొర్లించడం వల్ల గాలి బుడగలు (Air Bubbles) రాకుండా ఉంటాయి.

నివారణోపాయాలు:

నెయిల్ పాలిష్ ఎండిపోకుండా ఉండాలంటే, వాడిన ప్రతిసారీ మూతను గట్టిగా బిగించాలి. అలాగే, బాటిల్ మెడ భాగంలో అంటుకున్న రంగును రిమూవర్‌తో తుడిచి శుభ్రంగా ఉంచాలి. దీనివల్ల గాలి లోపలికి వెళ్లకుండా ఉంటుంది.

ఈ చిన్నపాటి చిట్కాలను పాటిస్తే మీ ఇష్టమైన నెయిల్ పాలిష్‌లను వృథా చేయకుండా, ఎక్కువ కాలం పాటు అందంగా వాడుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
వేసవి చర్మానికి అమృతం! పెరుగు–కీరదోస ఫేస్ ప్యాక్‌తో సహజమైన మెరుపు
వేసవి చర్మానికి అమృతం! పెరుగు–కీరదోస ఫేస్ ప్యాక్‌తో సహజమైన మెరుపు
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ బీభత్సం ఒకవైపు సెగలు.. మరోవైపు వానలు
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ బీభత్సం ఒకవైపు సెగలు.. మరోవైపు వానలు
టీమిండియా టీ20 ప్రపంచకప్ స్వ్కాడ్‌లో ఇద్దరు తెలుగోళ్లు..
టీమిండియా టీ20 ప్రపంచకప్ స్వ్కాడ్‌లో ఇద్దరు తెలుగోళ్లు..
అప్పుడు స్కూల్లో టీచర్.. ఇప్పుడు పాన్ ఇండియా గ్లామరస్ హీరోయిన్..
అప్పుడు స్కూల్లో టీచర్.. ఇప్పుడు పాన్ ఇండియా గ్లామరస్ హీరోయిన్..
సోమవారం సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ
సోమవారం సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ
ఖరీదైన నెయిల్‌ పాలిష్‌ కొద్ది రోజులకే ఎండిపోయిందా..? ఇలా చేస్తే
ఖరీదైన నెయిల్‌ పాలిష్‌ కొద్ది రోజులకే ఎండిపోయిందా..? ఇలా చేస్తే
ఆ 11 మంది ఎలా చనిపోయారు? ఓటీటీలోని ఈ రియల్ క్రైమ్ స్టోరీ చూశారా?
ఆ 11 మంది ఎలా చనిపోయారు? ఓటీటీలోని ఈ రియల్ క్రైమ్ స్టోరీ చూశారా?
చక్కెర డబ్బాలో చీమల దండయాత్ర.. ఈ ఒక్క వస్తువుంటే దెబ్బకు పరార్..
చక్కెర డబ్బాలో చీమల దండయాత్ర.. ఈ ఒక్క వస్తువుంటే దెబ్బకు పరార్..
టీ20 ప్రపంచకప్‌ జట్టులో తుఫాన్ ప్లేయర్.. అసలెవరీ నందినీ శర్మ..?
టీ20 ప్రపంచకప్‌ జట్టులో తుఫాన్ ప్లేయర్.. అసలెవరీ నందినీ శర్మ..?
సమ్మర్‌లో గుడ్లు తినడం మంచిదేనా? వైద్యులు ఏమంటున్నారంటే?
సమ్మర్‌లో గుడ్లు తినడం మంచిదేనా? వైద్యులు ఏమంటున్నారంటే?