Omicron Variant: రెండు మాస్క్‌లతో ఒమిక్రాన్‌ నుంచి రక్షణ.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!

|

Jan 14, 2022 | 7:26 PM

కరోనా నుంచి 91% రక్షణ పొందవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రజా రవాణా, ఆసుపత్రులు లేదా రద్దీగా ఉండే ప్రాంతాల్లో...

Omicron Variant: రెండు మాస్క్‌లతో ఒమిక్రాన్‌ నుంచి రక్షణ.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
Omicron Variant
Follow us on

ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్(Omicron) బారిన పడకుండా ఉండేందుకు రెండు మాస్క్‌లు(Two Masks) ధరించడం అవసరమని హాంగ్-కాంగ్ శాస్త్రవేత్తలు సూచించారు. కరోనా(Corona) నుంచి 91% రక్షణ పొందవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రజా రవాణా, ఆసుపత్రులు లేదా రద్దీగా ఉండే ప్రాంతాల్లో రెండు మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలి. ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉన్న టీకాలు తీసుకోని వ్యక్తులు, వైద్యులు, విమానాశ్రయ సిబ్బంది డబుల్ మాస్కింగ్‌ తప్పనిసరిగా అనుసరించాలని చెబుతున్నారు.

కరోనా వైరస్ వంటి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడానికి N95 మాస్క్‌లను ఉత్తమమైన మాస్క్‌లుగా పరిగణిస్తారు. ఇది ముక్కు లేదా నోటిలోకి వైరస్ ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. అదే సమయంలో, సాధారణ సర్జికల్ మాస్క్‌లు కూడా 85% కణాలను నిరోధించగలవు. క్లాత్ మాస్క్‌లు 30 నుంచి 60% రక్షణను మాత్రమే అందిస్తాయి.

ఏ రెండు మాస్క్‌లు కలిసి ధరించాలి అన్న విషయానికొస్తే.. సర్జికల్ మాస్క్‌ పైన క్లాత్ మాస్క్‌లను ఉపయోగించాలి. దీనికి కారణం- క్లాత్ మాస్క్ ధరించడం వల్ల సర్జికల్ మాస్క్ మూలలు పూర్తిగా బిగుతుగా ఉంటాయి. అలాగే, ఒకే సమయంలో రెండు సర్జికల్ మాస్క్‌లు ధరించడం పనికిరాదని గుర్తుంచుకోండి. ఇక N95 మాస్క్ ఒక్కటి ధరిస్తే చాలు పూర్తిగా బిగుతుగా ఉండి కరోనా నుంచి వంద శాతం రక్షణ ఇస్తుంది.